Telugu Global
National

గాడ్ ఫాదర్: థియేటర్లోనే బాణాసంచా కాల్చిన ఫ్యాన్స్...పరుగులు పెట్టిన ప్రేక్షకులు

హీరోల ఫ్యాన్స్ ఒక్కో సారి చేసే పిచ్చి పనులు పక్కవాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. మహా రాష్ట్రలోని ఓ థియేటర్ లో చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ ప్రదర్శన సందర్భంగా సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ థియేటర్ లోనే బాణా సంచా కాల్చడంతో ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు.

గాడ్ ఫాదర్: థియేటర్లోనే బాణాసంచా కాల్చిన ఫ్యాన్స్...పరుగులు పెట్టిన ప్రేక్షకులు
X

చిరంజీవి హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ గాడ్ ఫాదర్ దేశవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ మూవీలో బాలీ వుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటించడంతో నార్త్ లో ప్రేక్షకులు ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఫ్యాన్స్ అత్యుత్సాహం ఓ థియేటర్లో గందరగోళానికి కారణమయ్యింది.

మహారాష్ట్రలోని మాలేగావ్ లోని ఓ థియేటర్లో గాడ్ ఫాదర్ మూవీ హౌజ్ ఫుల్ అయ్యింది. కీతకిటలాడుతున్న జనాలు మూవీ చూడటంలో మునిగిపోయి ఉండగా 'తార్మార్... ' అనే పాట ప్రారంభమయ్యింది. అందులో చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి స్టెప్పులేశారు. అంతే... ఒక్క సారిగా సల్మాన్ అభిమానులు లేచి ఆనందంగా గెంతులు వేస్తూ వాళ్ళతో తెచ్చుకున్న బాణా సంచాను కాల్చారు. దీంతో ప్రేక్షకులు భయపడిపోయి థియేటర్ నుంచి బైటికి పరుగులు పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫ్యాన్స్ పిచ్చి అభిమానాన్ని చూసి నెటిజనులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఫ్యాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానం ఉండటం మంచిదే కానీ పిచ్చి ఉండటం, ఆ పిచ్చితో పక్కవాళ్ళను ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.

గతంలో కూడా సల్మాన్ ఫ్యాన్స్ ఇలాంటి పిచ్చి పనులే చేశారు. సల్మాన్ హీరోగా నటించిన 'అంతిమ్' అనే మూవీ విడుదలైనప్పుడు కూడా ఇలాగే థియేటర్లలో బాణాసంచా పేల్చగా సల్మాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పనులు చేయవద్దని తన ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేశారు. ఆ మాటలు వింటే వాళ్ళు పిచ్చి ఫ్యాన్స్ ఎలా అవుతారు. అందుకే మళ్ళీ వాళ్ళు అదే పని చేశారు.

ఈ మూవీలో సల్మాన్ మసూం భాయ్ పాత్రలో నటించారు. ఓ పాటకు డ్యాన్స్ కూడా చేశారు. దీంతో ఆయన ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు.


First Published:  8 Oct 2022 9:39 AM GMT
Next Story