Telugu Global
National

ఎన్నికలు అవసరం లేకుండానే మమతా బెనర్జీ సర్కార్ కూలిపోతుంది.. అమిత్ షా వివాదాస్పద వ్యాఖలు

బెంగాలీ నూతన సంవత్సరం సందర్భంగా రెండు రోజుల పర్యటనకు బెంగాల్ వెళ్ళిన‌ షా, బీర్భూమ్‌లోని సూరిలో జరిగిన 'జన్ సంపర్క్ సమావేశ్'లో మాట్లాడుతూ, "2024లో మాకు 35 ప్లస్ MP సీట్లు ఇచ్చి నరేంద్ర మోడీని మళ్లీ ప్రధానిని చేయండి. ఇక అప్పుడు 2025 దాకా కూడా మమతను భరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మమతా దీదీ ప్రభుత్వం అంతకంటే ముందే కూలిపోతుంది.'' అని వ్యాఖ్యానించారు అమిత్ షా.

ఎన్నికలు అవసరం లేకుండానే మమతా బెనర్జీ సర్కార్ కూలిపోతుంది.. అమిత్ షా వివాదాస్పద వ్యాఖలు
X

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందే మమతా బెనర్జీ సర్కార్ కూలిపోతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ''2024 లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని 35 ఎంపీ సీట్లలో గెలిపించండి. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలే అవసరం లేదు.అంతకు ముందే మమత సర్కార్ కూలిపోతుంది.'' అని ఆయన అన్నారు.

బెంగాలీ నూతన సంవత్సరం సందర్భంగా రెండు రోజుల పర్యటనకు బెంగాల్ వెళ్ళిన‌ షా, బీర్భూమ్‌లోని సూరిలో జరిగిన 'జన్ సంపర్క్ సమావేశ్'లో మాట్లాడుతూ, "2024లో మాకు 35 ప్లస్ సీట్లు ఇచ్చి నరేంద్ర మోడీని మళ్లీ ప్రధానిని చేయండి. ఇక అప్పుడు 2025 దాకా కూడా మమతను భరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మమతా దీదీ ప్రభుత్వం అంతకంటే ముందే కూలిపోతుంది.'' అని వ్యాఖ్యానించారు అమిత్ షా.

మాకు 35 ఎంపీ సీట్లు ఇస్తే ఇక శ్రీరామ నవమి ర్యాలీలపై ఎవరూ దాడి చేసే సాహసం చేయరు అని చెప్పిన అమిత్ షా, బుజ్జగింపు రాజకీయాల కోసం హౌరా, హుగ్లీలలో శ్రీరామ నవమి హింసను మమతా బెనర్జీ స్పాన్సర్ చేశారని ఆరోపించారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో బీజేపీ కుటుంబ పాలనను రద్దు చేసిందని, తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని ముఖ్యమంత్రిని చేసి కుటుంబపాలన సాగించాలనుకుంటున్న మమత ఆట‌లను కూడా బీజేపీ సాగనియ్యబోదని షా అన్నారు.

కాగా, అమిత్ షా వ్యాఖ్యలను తృణమూల్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. అప్రజాస్వామికంగా బెంగాల్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి షా కుట్ర పన్నుతున్నారని TMC అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ ఆరోపించారు.

" 2025కి ముందే మా ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి షా కుట్ర చేస్తున్నారు. కేంద్ర హోం మంత్రి నేరుగా బెదిరింపులకు దిగడం అన్యాయం. లోక్‌సభ ఎన్నికలకు , ప్రభుత్వం కూలిపోవడానికి సంబంధం ఏమిటి? ఇది బెంగాల్‌పై బిజెపి ద్వేషాన్ని, కుట్రను బహిర్గతం చేస్తుంది." అన్నారాయన‌

Next Story