Telugu Global
National

గౌతమ్ అదానీకి 'జ‌డ్‌' కేట‌గిరి భద్రత

అదానీకి 'జ‌డ్ ' కేటగిరీ విఐపి భద్రతను కల్పిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఆయనకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) విఐపి సెక్యూరిటీ వింగ్ భద్రత ఏర్పాటు చేశారు.

గౌతమ్ అదానీకి జ‌డ్‌ కేట‌గిరి భద్రత
X

బిలియనీర్ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి కేంద్ర ప్రభుత్వం సిఆర్‌పిఎఫ్ కమాండోలతో 'జ‌డ్ ' కేటగిరీ విఐపి భద్రతను కల్పించినట్లు అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. ఈ భద్రత‌"చెల్లింపు ప్రాతిపదికన" ఉంటుందని, నెలకు రూ.15-20 లక్షలు ఖర్చవుతుందని వారు చెప్పారు.

ఈ సొమ్మును ఆయ‌నే చెల్లించుకోవాల్సి ఉంటుంది. అదానీకి ముప్పు ఉంద‌ని సెంట్రల్ సెక్యూరిటీ ఏజెన్సీలు ఇచ్చిన‌ నివేదిక ఆధారంగా అర‌వై యేళ్ళ అదానీ కి కేంద్ర సంస్థ భద్రత కల్పించినట్లు వారు తెలిపారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) విఐపి సెక్యూరిటీ వింగ్‌ను భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించింది. ప్ర‌స్తుతం ఆ స్క్వాడ్ అదాని వ‌ద్ద విధుల్లో చేరింద‌ని ఆ వ‌ర్గాలు తెలిపాయి.

ఆర్ఐఎల్ ఛైర్మన్ ముఖేష్ అంబానీకి 2013లో కేంద్ర ప్రభుత్వం సిఆర్పిఎఫ్ క‌మాండోల జ‌డ్+ కేటగిరీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు అతని భార్య నీతా అంబానీకి కూడా తక్కువ కేటగిరీ భ‌ద్ర‌త‌ను క‌ల్పించింది.

ఇటీవ‌ల అంబానీ, అదానీ వంటి ప్ర‌ముఖుల‌కు హెచ్చ‌రిక‌లు వ‌స్తున్న నేపథ్యంలో ఈ చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

First Published:  17 Aug 2022 3:56 PM GMT
Next Story