Telugu Global
National

కోహినూర్ వెనక్కి తేవాలంటే ఇలా చేయాలంట! రిషి సునాక్‌పై ఫన్నీ ట్రోల్స్..

రిషి సునాక్ అచ్చం టీమిండియా మాజీ క్రికెటర్ ఆశిష్‌ నెహ్రా లాగేనే ఉన్నాడంటూ ఇంటర్నెట్‌లో సరదా మీమ్స్ మొదలయ్యాయి. అయితే తాజాగా భారత్‌కు కోహినూర్ తెప్పించడంపై నెట్టింట ఫన్నీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

కోహినూర్ వెనక్కి తేవాలంటే ఇలా చేయాలంట! రిషి సునాక్‌పై ఫన్నీ ట్రోల్స్..
X

భారతీయ మూలాలున్న రిషి సునాక్‌ ఇటీవల బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్త వెలుగులోకి వచ్చినప్పటి నుంచి రిషి సునాక్ అచ్చం టీమిండియా మాజీ క్రికెటర్ ఆశిష్‌ నెహ్రా లాగేనే ఉన్నాడంటూ ఇంటర్నెట్‌లో సరదా మీమ్స్ మొదలయ్యాయి. అయితే తాజాగా భారత్‌కు కోహినూర్ తెప్పించడంపై నెట్టింట ఫన్నీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అందులో సారాంశం ఏంటంటే..

కోహినూర్‌ను వెనక్కి రప్పించేందుకు తన స్నేహితుడు ఒక మంచి ఐడియా ఇచ్చాడంటూ ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా ట్విటర్‌లో ఒక ఫన్నీ పోస్ట్ పెట్టాడు. అందులో కోహినూర్ యాక్షన్ ప్లాన్ ఇలా ఉంది.

"ముందుగా రిషి సునాక్‌ను భారత్‌కు రప్పించాలి.

తన మామగారి(ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి) కుటుంబాన్ని చూసేందుకు బెంగళూరు వెళ్లి , అక్కడ ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు ఆయన్ను కిడ్నాప్‌ చేయాలి.

ఆ తర్వాత బ్రిటన్‌ ప్రధానిగా రిషి ప్లేస్‌లో ఆశిష్‌ నెహ్రాను పంపాలి. ఇద్దరూ ఒకేలా ఉంటారు కాబట్టి తేడా ఎవరూ గమనించలేరు.

నెహ్రాతో కోహినూర్‌ను వెనక్కి రప్పించే బిల్లును ఆమోదించమని చెప్పాలి. అంతే కోహినూర్ వెనక్కి వచ్చేస్తుంది." ఇదీ ఆ ట్వీట్ సారాంశం.

అయితే ఈ ఐడియాపై నెటిజన్లు కూడా సరదాగా ట్వీట్లు చేస్తున్నారు. ' బెంగళూరు ట్రాఫిక్‌లో చిక్కుకున్న తర్వాత కిడ్నాప్‌ అవసరం లేదు' అని ఒకరు. 'నెహ్రా బ్రిటిష్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడతారు' అని మరొకరుఇలా ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

First Published:  28 Oct 2022 5:59 AM GMT
Next Story