Telugu Global
National

చైనా విషయంలో మోదీ, వాజ్ పేయ్ ల‌పై బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి తీవ్ర విమర్శలు

చైనా విషయంలో మోదీ, వాజ్ పేయ్ ల‌పై బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి తీవ్ర విమర్శలు
X

చైనా విషయం లో తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, మాజీ ప్రధాని వాజ్ పేయి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీలపై బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి తీవ్ర విమర్షలు చేశారు.

టిబెట్, తైవాన్ లను చైనా తన దేశ౦లో ‍అంత‌ర్భాగం చేసుకోవడానికి జవహర్‌లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్‌పేయిలే కారణమని ఆయన విరుచుక పడ్డారు.

''జవహర్‌లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్‌పేయిల మూర్ఖత్వం కారణంగా టిబెట్, తైవాన్ లను చైనాలో భాగమని భారతీయులు అంగీకరించాల్సి వచ్చింది. " అని సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు.

ఆయన ప్రధాని మోడీ ని కూడా వదల లేదు. చైనా పరస్పరం అంగీకరించిన లైన్ ఆఫ్ కంట్రోల్ (LAC) ని కూడా గౌరవించడం లేదని ఆయన అన్నారు. ''ఇప్పటికే లడఖ్ లోని కొన్ని భూభాగాలను చైనా ఆక్రమించుకుంది. అయినా మోదీ నిద్ర మత్తులో ఉన్నారు. మన భూభాగంలోకి ఎవరూ రాలేదని చెప్తున్నారు. "కోయి అయా నహిన్"(ఎవరూ రాలేదు) అంటూ ఎవిరిని నమ్మిస్తున్నట్టు'' అని సుబ్రమణ్య స్వామి ప్రశ్నించారు. త్వరలోనే మన దేశంలో ఎన్నికలున్నాయనే విషయం చైనా గుర్తించాలి అని ఆయన ట్వీట్ చేశారు.

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ లో పర్యటిస్తున్న సమయంలో స్వామి ఈ అంశాన్ని లేవనెత్తడం ప్రాధాన్యం సంతరించుకుంది.

First Published:  3 Aug 2022 7:17 AM GMT
Next Story