Telugu Global
National

గోవాలో రెస్టారెంట్.. వెలుగులోకి వాస్తవాలు..

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూతురుకు గోవాలో బార్ అండ్ రెస్టారెంట్ ఉందా లేదా ? ఉంటే అది ఫేక్ లైసెన్స్ తో నడుస్తుందా ? అంతా అబద్దమని చెప్తున్న స్మృతి ఇరానీ మాటల్లో నిజమెంత ?

గోవాలో రెస్టారెంట్.. వెలుగులోకి వాస్తవాలు..
X

గోవాలో తనకు, లేదా తన కూతురికి ఎలాంటి బార్ అండ్ రెస్టారెంట్ లేదని, కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సాక్షాత్తూ ఢిల్లీ హైకోర్టునే బురిడీ కొట్టించారా? కొన్ని విషయాలను కావాలనే దాచి పెట్టారా.. ? కానీ.. ఎన్నాళ్లని నిజాలు దాస్తారు ? ఈ మొత్తం వ్యవహారం మీద మీడియా లోతుగా 'ఇన్వెస్టిగేషన్' చేస్తే ఇది నిజమేనని తేలింది. మోడీ ప్రభుత్వంలోని ఈ మంత్రి మరీ నిష్కళకంగా లేరని రుజువవుతుంది. గోవాలో 'సిల్లీ సోల్స్ కేఫ్ అండ్ బార్' పేరిట అక్రమంగా ..ఫేక్ లైసెన్స్ తో రెస్టారెంట్ నిర్వహిస్తున్నారని స్మృతి కుటుంబం మీద వచ్చిన ఆరోపణలు ఈ మధ్య హాట్ హాట్ అయ్యాయి. చనిపోయిన వ్యక్తి పేరిట లైసెన్సును రెన్యువల్ చేయించుకుని దీన్ని నడుపుతున్నారని కాంగ్రెస్ నిందలేస్తే.. అంతా అబధ్దమని, మీమీద పరువు నష్టం వేస్తామని మేడం ఢిల్లీహైకోర్టు కెక్కారు. ఈ రెస్టారెంట్ విషయంలో తానేమీ దాచలేదని ఆమె ప్రమాణం చేసినంత పని చేశారు. కోర్టు కూడా ఈ వ్యవహారంలో ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. స్మృతి పేరిట, ఆమె కుమార్తె పేరిట సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులన్నీ డిలీట్ చేయాలని కాంగ్రెస్ నాయకుల్ని ఆదేశించింది.

కానీ ఇంకొంచెం లోతులోకి వెళ్లి చూస్తే.. వివాదాస్పదమైన ఈ బార్ అండ్ రెస్టారెంట్ గోవాలో .. 'హౌస్ నెం. 452, బౌటా వాడో, అసాగో' అనే అడ్రస్ లో కొనసాగుతోందన్న విషయం బయట పడింది. దీన్ని కంట్రోల్ చేస్త్తున్నది మరెవరో కాదు.. స్మృతి ఇరానీ భర్త, ఆమె కుటుంబ ఆధ్వర్యంలోని 'ఎయిటాల్ ఫుడ్ అండ్ బెవరేజ్' అనే కంపెనీయేనట.. ఈ సంస్థకు కేటాయించిన జీఎస్టీ నెంబరు ... . 'సిల్లీ సోల్స్ కేఫ్ అండ్ బార్' కి కేటాయించిన నెంబరు దాదాపు ఒకే విధంగా ఉన్నట్టు తేలింది. ఈ రెస్టారెంట్ 'యాగ్రిగేటర్' వెబ్ సైట్స్ లో ఈ నెంబరే దాఖలైన విషయం తెలిసింది.

2021 మార్చి 31 తో అంతమైన ఆర్థిక సంవత్సరానికి ఈ కంపెనీ (ఎయిటాల్ ఫుడ్ అండ్ బెవరేజ్) సమర్పించిన బ్యాలన్స్ షీట్లు, లాభాలు లేదా నష్టాల స్టేట్ మెంట్లను బట్టి చూస్తే ఆల్కహాలు, తిండి, లిక్కర్ అమ్మకాల తాలూకు బిజినెస్ అంతా నిర్వహించడానికి లైసెన్స్ అవసరమని స్పష్టం చేశారు. స్మృతి భర్త జుబిన్ ఇరానీ ఇన్స్ టాగ్రామ్ లో .. తన బయోగ్రఫీ డీటైల్స్ లో భాగంగా 'సిల్లీ సోల్స్ కేఫ్ గోవా' కో-ఫౌండర్ గా తనను చెప్పుకున్నారు. పైగా వీరి కూతురు 18 ఏళ్ళ జోయిష్ ఇరానీ .. ఫుడ్ క్రిటిక్ కునాల్ విజయ్ కర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రెస్టారెంట్ మీదేనా అన్న ప్రశ్నకు ఎస్ అని చెప్పింది. ఇదంతా చూస్తే జుబిన్ ఇరానీ నిర్వహిస్తున్న కంపెనీయే ఈ బార్ అండ్ రెస్టారెంట్ కి కూడా ఓనర్ అన్నది స్పష్టమవుతోంది. అంటే ఆయనే యజమాని అన్న విషయంలో డౌట్ ఎందుకు ? స్మృతి దంపతుల కొడుకు, కుటుంబంలోని ఇతర సభ్యులకు కూడా మరో రెండు కంపెనీల్లో 75 శాతం వాటా ఉందట. అసలు ఈ బార్ అండ్ రెస్టారెంట్ యజమాని ఆంథోనీ డీ గామా.. అయన గత ఏడాది మే లో మరణించాడు. ఆయన కొడుకైన డీన్ డీ గామా ఈ హోటల్ ఓనర్ అని భావించిన పక్షంలో జుబిన్ ఇరానీ నేతృత్వం లోని కంపెనీ తన బిజినెస్ కి గాను దీని లైసెన్సును వినియోగించుకోకూడదు. గోవా ఎక్సయిజు చట్టం లోని రూల్ 90 ప్రకారం.. ఒక వ్యక్తికి లేదా సంస్థకు లేక కంపెనీకి మంజూరు చేసిన లైసెన్స్ పూర్తిగా వ్యక్తిగతమని, దాన్ని బదిలీ చేయడానికి వీలు లేదని స్పష్టంగా పేర్కొంటోంది. మొత్తం ఈ వ్యవహారంపై డీన్ డీ గామాను సంప్రదించడానికి ఓ మీడియా సంస్థ యత్నించగా ఆయన స్పందించలేదు. ఇదంతా కేంద్రంలోని 'పెద్దోళ్ల యవ్వారం.. మనకెందుకొచ్చిన గొడవ' అనుకున్నాడో ఏమో మరి !






First Published:  3 Aug 2022 3:26 AM GMT
Next Story