Telugu Global
National

సల్మాన్ ఇంటిపై కాల్పులు.. ముంబైలో కలకలం

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించేందుకు ఆపరేషన్ మొదలుపెట్టారు.

సల్మాన్ ఇంటిపై కాల్పులు.. ముంబైలో కలకలం
X

బాలీవుడ్‌ హీరో సల్మాన్ ఖాన్‌ ఇంటి దగ్గర కాల్పులు కలకలం సృష్టించాయి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారుజామున ఈ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. బైక్‌పై వచ్చిన దుండగుడు బాంద్రాలోని సల్మాన్‌ఖాన్ నివాసం టార్గెట్‌గా కొన్ని రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అనంతరం అక్కడి నుంచి దుండగుడు పారిపోయాడని పోలీసులు చెప్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించేందుకు ఆపరేషన్ మొదలుపెట్టారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించడం ప్రారంభించింది.

గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్ బిష్ణోయ్‌ టార్గెటెడ్‌ లిస్టులో సల్మాన్‌ ఖాన్‌ టాప్‌లో ఉన్నాడని గత సంవత్సరం NIA స్పష్టం చేసింది. 1998 నాటి కృష్ణ జింకల వేటాడే కేసులో సల్మాన్ ఉన్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బిష్ణోయ్‌...సల్మాన్‌ ఖాన్‌ను టార్గెట్‌ చేసుకున్నారని అధికారులు చెప్తున్నారు. బిష్ణోయ్ అనుచరుడు సంపత్ నెహ్రా..సల్మాన్‌ ఖాన్‌ నివాసంపై నిఘా పెట్టాడని ప్రచారం జరిగింది. అయితే సంపత్‌ నెహ్రాను ఇప్పటికే హార్యానా పోలీసులు అరెస్టు చేశారు.

గతేడాది సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపు కాల్స్ రావడంతో ముంబై పోలీసులు అతనికి భద్రత పెంచారు. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌ Y+ సెక్యూరిటీ ఉంది. గతంలో సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపు ఇమెయిల్‌ పంపిన యుకేలోని ఇండియన్ స్టూడెంట్‌పై పోలీసులు లుక్‌అవుట్‌ నోటీసు కూడా జారీ చేశారు.

First Published:  14 April 2024 5:06 AM GMT
Next Story