Telugu Global
National

ప్రియురాలితో సన్నిహితంగా బాలీవుడ్ నిర్మాత.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్యను కారుతో తొక్కించిన వైనం

ఈ సంఘటనకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్‌ బయటికి రావడంతో అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ ఘటనపై కిషోర్ మిశ్రా భార్య అంబోలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ప్రియురాలితో సన్నిహితంగా బాలీవుడ్ నిర్మాత.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్యను కారుతో తొక్కించిన వైనం
X

బాలీవుడ్‌కు చెందిన ఒక ప్రముఖ నిర్మాత ప్రియురాలితో పార్కింగ్ ప్రదేశంలో సన్నిహితంగా ఉండగా..అతడిని భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీంతో అతడు కారులో పారిపోయే ప్రయత్నం చేయగా భార్య కారుకు అడ్డుగా నిలబడింది. అయినా అతడు లెక్క చేయకుండా కారుతో ఆమెను ఢీకొట్టాడు. ఆమె కింద పడిపోయిన తర్వాత ఆమె మీద నుంచి కారును పోనిచ్చి కర్కశంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన ఈనెల 10వ తేదీన జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స‌ద‌రు నిర్మాత భార్య జరిగిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత కమల్ కిషోర్ మిశ్రాకు అంబోలి అనే మహిళతో వివాహమైంది. కాగా కిషోర్ మిశ్రా కొన్ని నెలల కిందట ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 10 వ తేదీన అతడు అంధేరిలోని ఓ ఇంటి సెల్లార్ పార్కింగ్ స్థలంలో కారులో తన ప్రియురాలితో సన్నిహితంగా ఉండగా అంబోలి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీంతో కిషోర్ మిశ్రా అక్కడ్నుంచి పారిపోవాలని ప్రయత్నించాడు.

అయితే అంబోలి అతడి కారుకు అడ్డుగా నిలిచింది. అయినా అతడు లెక్క చేయకుండా ఆమెను కారుతో ఢీ కొట్టించాడు. ఆమె కింద పడిపోగా కనికరం కూడా లేకుండా ఆమె మీదుగానే కారును పోనిచ్చాడు. ఆ సమయంలో అంబోలి పెట్టిన కేకలు వినపడటంతో సమీపంలోని ఓ వ్యక్తి అక్కడికి చేరుకొని ఆమెను కాపాడాడు. ఈ ఘటనలో అంబోలి తలకు, కాళ్లకు, చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి.

కాగా ఈ సంఘటనకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్‌ బయటికి రావడంతో అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ ఘటనపై కిషోర్ మిశ్రా భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త తనను కారుతో తొక్కించి చంపడానికి ప్రయత్నించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కిషోర్ మిశ్రాపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

First Published:  27 Oct 2022 7:04 AM GMT
Next Story