Telugu Global
National

కరోనా భయం: చైనా నుండి విమానాలు రానివ్వొద్దని 70 శాతం మంది ప్రజల డిమాండ్ ...సర్వే

సోషల్ కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ 'లోకల్ సర్కిల్స్' అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో 70 శాతం మంది ప్రజలు చైనా నుండి భారత్ కు విమాన సర్వీసులు నిలిపివేయాలని అభిప్రాయపడ్డారు.

కరోనా భయం: చైనా నుండి విమానాలు రానివ్వొద్దని 70 శాతం మంది ప్రజల డిమాండ్ ...సర్వే
X

కరోనా భయం: చైనా నుండి విమానాలు రానివ్వొద్దని 70 శాతం మంది ప్రజల డిమాండ్ ...సర్వే

మళ్ళీ ప్రపంచానికి కరోనా భయం పట్టుకుంది. చైనా , అమెరికాతో సహా పలు దేశాల్లో కోవిడ్ ఉదృతి పెరగడంతో భారతీయులు కూడా భయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన వద్దని చెప్తూనే బూస్టర్ డోసులు తీసుకోవాలని, మాస్క్ లు ధరించాలని ప్రజలకు సూచించింది. ప్రస్తుతం కోవిడ్ సబ్ వేరియంట్ BF.7 విస్త్రుతంగా వ్యాపిస్తోంది.

ఈ నేపథ్యంలో సోషల్ కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ 'లోకల్ సర్కిల్స్' అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో మెజార్టీ ప్రజలు చైనా నుండి భారత్ కు విమాన సర్వీసులు నిలిపివేయాలని అభిప్రాయపడ్డారు.

చైనా నుండి వచ్చే అన్ని విమానాలను నిలిపివేయాలని, గత 14 రోజుల్లో చైనాలో ఉన్న ఎవరినైనా నిర్బంధ క్వారంటైన్ లో ఉంచాలని 70 శాతం ప్రజలు చెప్పారు.

దాదాపు 16 శాతం మంది ప్రజలు ప్రభుత్వం చైనా నుండి విమానాలను మాత్రమే నిలిపివేయాలని, గత 14 రోజులలో చైనాలో ఉన్న ప్రయాణీకులకు కోవిడ్ పరీక్షలు చేసి నెగిటెవ్ అని తేలితే ఇతర దేశాల ద్వారా వచ్చేలా అనుమతించాలని చెప్పారు.

కాగా చైనాలో 60 శాతానికి పైగా, ప్రపంచ జనాభాలో 10 శాతం మంది రాబోయే 90 రోజుల్లో కరోనా వ్యాధి బారిన పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు, లక్షల మంది మరణించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మెజారిటీ భారతీయులు (87 శాతం) చైనా నుండి అన్ని ప్రత్యక్ష, పరోక్ష విమానాలను నిలిపివేయడానికి అనుకూలంగా ఉన్నారని సర్వే ఫలితాలు సూచించాయి.

మరోవైపు కొత్త కోవిడ్ ఇన్ఫెక్షన్ BF.7 అకస్మాత్తుగా పెరగడాన్ని గమనించిన‌ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా బుధవారం దేశంలో కోవిడ్ -19 పరిస్థితిని సమీక్షించారు.

కొత్త వేరియంట్‌లను ట్రాక్ చేయడానికి సానుకూల కేసుల మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పెంచాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది.

First Published:  22 Dec 2022 5:52 AM GMT
Next Story