Telugu Global
National

మీ ఫాస్ట్ ట్యాగ్ డీ యాక్టివేట్ కాకుండా ఉండాలంటే..?

జనవరి 31నుంచి ఆ ఫాస్ట్ ట్యాగ్ లు పనిచేయవు. వాటి స్థానంలో కొత్తవి తీసుకోవాలన్నా కూడా కేవైసీ తప్పనిసరి. అంటే ముందుగానే జాగ్రత్త పడటం మంచిది.

మీ ఫాస్ట్ ట్యాగ్ డీ యాక్టివేట్ కాకుండా ఉండాలంటే..?
X

కేవైసీ చేయించని ఫాస్ట్ ట్యాగ్ లకు ఈనెలాఖరు వరకే గడువు. ఆలోగా మీ వాహనాలకున్న ఫాస్ట్ ట్యాగ్ లకు కేవైసీ పూర్తి చేసుకోవడం మేలు. లేకపోతే జనవరి 31నుంచి ఆ ఫాస్ట్ ట్యాగ్ లు పనిచేయవు. వాటి స్థానంలో కొత్తవి తీసుకోవాలన్నా కూడా కేవైసీ తప్పనిసరి. అంటే ముందుగానే జాగ్రత్త పడటం మంచిది. లేకపోతే కేవైసీ చేయించుకోని వాటిని బ్లాక్ లిస్ట్ లో పెడతామని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రకటించింది.

ఇప్పటికే చాలా వరకు ఫాస్ట్ ట్యాగ్ లు బ్లాక్ లిస్ట్ లో ఉంటున్నాయి. టోల్ ప్లాజాల వద్ద ఆయా వాహనాలను ఆపి, బ్లాక్ లిస్ట్ అని చెబుతున్నారు. ఆ తర్వాత వాహనం నెంబర్లను ఎంట్రీ చేసి టోల్ ఫీజు మినహాయించుకుంటున్నారు. అయితే జనవరి-31నుంచి కేవైసీ చేయించుకోని అన్ని వాహనాలదీ ఇదే పరిస్థితి. ఇకపై వాహనం నెంబర్ ఎంట్రీ చేసుకున్నా ఆ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ నుంచి టోల్ ఫీజు చెల్లింపు జరగదు. అంటే అవి పూర్తిగా బ్లాక్ అయిపోతాయి.

ఎందుకిలా..?

టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్‌ ట్యాగ్‌ తప్పనిసరి చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 8 కోట్ల మంది దీనిని వినియోగిస్తున్నారు. అయితే చాలామంది ఫాస్ట్‌ ట్యాగ్‌ ని వాహనానికి అతికించే విధానంలో లోపాలున్నాయి. ఇష్టం వచ్చినచోట వాటిని అతికించడం వల్ల ఆలస్యమవుతోంది. వారి వెనకున్న వాహనాలు కూడా టోల్ ప్లాజాల వద్ద ఆగిపోవాల్సి వస్తోంది. మరికొందరు ఒకే ఫాస్ట్ ట్యాగ్ ని వేర్వేరు వాహనాలకు వినియోగిస్తున్నారు. వీటన్నిటినీ సరిదిద్దేందుకు NHAI కొత్త రూల్ తీసుకొచ్చింది. ఒక వాహనానికి, ఒకటే ఫాస్ట్ ట్యాగ్ నెంబర్ ఉండాలనే కండిషన్ పెట్టింది. 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్‌ట్యాగ్' అనే విధానం తీసుకొచ్చింది. అందుకే వాహనదారుల్ని కేవైసీ చేయించుకోవాలని చెప్పింది. సాధారణంగా ఫాస్ట్ ట్యాగ్ జారీ చేసేటప్పుడే కేవైసీ పూర్తి చేస్తారు. కొంతమంది సిబ్బంది హడావిడిగా ఫాస్ట్ ట్యాగ్ లు ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ జనవరి-31 తర్వాత చెల్లుబాటు కావు. అంటే ఇకపై కేవైసీ పూర్తయిన ఫాస్ట్ ట్యాగ్ లు మాత్రమే పనిచేస్తాయన్నమాట.

First Published:  16 Jan 2024 3:22 AM GMT
Next Story