Telugu Global
National

బీజేపీ,కాంగ్రెస్ లకు దూరంగా... ఒక్కటవుతున్న ఇతర పక్షాలు

శుక్రవారం కోల్‌కతాలో సమాజ్ వాదీ పార్టీ ఛీఫ్ అఖిలేష్ యాదవ్, బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ ఛీఫ్ మమతా బెనర్జీ తో సమావేశమయ్యారు. బీజెపి, కాంగ్రెసేతర పక్షాలన్నింటినీ ఏకం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం.

బీజేపీ,కాంగ్రెస్ లకు దూరంగా... ఒక్కటవుతున్న ఇతర పక్షాలు
X

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక పోరాటంలో కాంగ్రెస్ తో కలిసి సాగొద్దని ఇతర విపక్షాలు ఆలోచిస్తున్నాయి. బీజేపీకి, కాంగ్రెస్ కు సమదూరం పాటించాలని విపక్ష పార్టీలు నిర్ణయించుకున్నట్టుగా కనపడుతోంది.

శుక్రవారం కోల్‌కతాలో సమాజ్ వాదీ పార్టీ ఛీఫ్ అఖిలేష్ యాదవ్, బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ ఛీఫ్ మమతా బెనర్జీ తో సమావేశమయ్యారు. బీజెపి, కాంగ్రెసేతర పక్షాలన్నింటినీ ఏకం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం.

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటామని మమతా బెనర్జీ, అఖిలేష్‌ యాదవ్‌లు వ్యాఖ్యానించారు.

"కాంగ్రెస్, బిజెపి రెండింటికీ దూరంగా ఉంటూ తృణమూల్ కాంగ్రెస్ తన సొంత మార్గంలో వెళ్తుంది" అని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ ఎంపి సుదీప్ బందోపాధ్యాయ, ఇరు పార్టీల‌ అధినేతల‌ నేతల సమావేశం తర్వాత అన్నారు.

అయితే, తాము ప్రస్తుతం మూడవ ఫ్రంట్ గురించి మాట్లాడటం లేదని ఆయన అన్నారు.అదే సమయంలో కాంగ్రెస్ ప్రతిపక్షాల బిగ్ బాస్ అని ప్రచారాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఎదుర్కోవడానికి వ్యూహాన్ని రూపొందించడానికి తమ పార్టీ ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతుందని ఆయన చెప్పారు.

సమావేశం తర్వాత అఖిలేష్ యాదవ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తమ పార్టీ కాంగ్రెస్, బీజేపీ రెండింటికీ సమాన దూరాన్నిపాటిస్తుందని, తాము టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి అండగా నిలుస్తామని చెప్పారు.

త్వరలో మమతా బెనర్జీ ఒడిశా ముఖ్యమంత్రి , బిజూ జనతా దళ్ ఛీఫ్ నవీన్ పట్నాయ క్ తో కూడా సమావేశం కానున్నారు. ఆయన కూడా బీజేపీ, కాంగ్రెస్ లకు దూరంగా ఇతర పక్షాలతో కలిసి పని చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో భారత రాష్ట్ర సమితి కూడా అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ లకు దూరం పాటిస్తోంది. నిజానికి ఆ రెండు పార్టీలతో బీఆరెస్ తెలంగాణలో పోరాడుతోంది.

First Published:  17 March 2023 2:49 PM GMT
Next Story