Telugu Global
National

క‌రెంటు మీట‌ర్‌కి రీచార్జ్.. సెల్‌ఫోన్‌ లాగే..

మొదట అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, నెలకు 500యూనిట్లకు పైగా కరెంట్ వాడేవారికి, 18లక్షల వ్యవసాయ సర్వీసులకు ఈ స్మార్ట్ మీటర్లు బిగించనున్నారు. దీనికి వినియోగదారుడి నుంచి డబ్బు ఏమీ వసూలు చేయరు.

క‌రెంటు మీట‌ర్‌కి రీచార్జ్.. సెల్‌ఫోన్‌ లాగే..
X

ఇక కరెంట్ బిల్లు ఎంత వస్తుందో అనే ఆందోళన ఉండదు. బిల్లు కట్టాల్సిన గడువు దాటిపోతుందనే భయం, దాటిపోయిందనే ఆందోళన ఉండవు. ఎంచక్కా సెల్ ఫోన్ రీచార్జ్ చేసుకున్నట్లే కరెంట్ మీటర్ కి కూడా రీచార్జ్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.92కోట్ల విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రీపెయిడ్ మీటర్లైన వీటిని మన సెల్ ఫోన్తో రీచార్జి చేసుకోవచ్చు.రాష్ట్రంలో ఎక్కువ కరెంట్ వాడే 59లక్షలకు పైగా కరెంట్ సర్వీసులకు ఈ మీటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదట అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, నెలకు 500యూనిట్లకు పైగా కరెంట్ వాడేవారికి, 18లక్షల వ్యవసాయ సర్వీసులకు ఈ స్మార్ట్ మీటర్లు బిగించనున్నారు. దీనికి వినియోగదారుడి నుంచి డబ్బు ఏమీ వసూలు చేయరు.

రాష్ట్రంలోని మూడు డిస్కంల పరిధిలో ఇప్పటివరకు ప్రైవేటు కాంట్రాక్టర్లే ప్రతినెల విద్యుత్‌ బిల్లులను తీస్తున్నారు. అందుకుగాను వారికి ఒక్కో రీడింగుకు పట్టణాల్లో రూ.3.29పై.. గ్రామాల్లో రూ.3.52పై కమిషన్‌గా ఇస్తున్నారు. ఇక మీదట డిస్కంలకు ఈ ఖర్చు ఉండదు.

దేశమంతా ఇలాగే :

దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకూ అన్ని రాష్ట్రాల్లో కలిపి 44లక్షల స్మార్ట్ మీటర్లు బిగించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 11లక్షల స్మార్ట్ మీటర్లు, బీహార్ లో 8లక్షలు, రాజస్థాన్ లో 5లక్షలు, హర్యానాలో 4లక్షలు, అస్సాంలో 2లక్షలకు పైగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశారు.

First Published:  3 Sep 2022 10:34 AM GMT
Next Story