Telugu Global
National

రాష్ట్రాలకు పెండింగ్ లో ఉన్న రూ. 16,982 కోట్ల జీఎస్టీ కాంపన్సేషన్ సెస్‌ను క్లియర్ చేస్తాం : నిర్మలా సీతారామన్

అకౌంటెంట్ జనరల్ (ఏజీ) సర్టిఫికేట్ సమర్పించిన ఆరు రాష్ట్రాలకు రూ.16,524 కోట్లు విడుదల చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు.

రాష్ట్రాలకు పెండింగ్ లో ఉన్న రూ. 16,982 కోట్ల జీఎస్టీ కాంపన్సేషన్ సెస్‌ను క్లియర్ చేస్తాం : నిర్మలా సీతారామన్
X

జూన్ 2022 వరకు రాష్ట్రాలకు పెండింగ్ ఉన్న మొత్తం రూ.16,982 కోట్ల జీఎస్టీ కాంపన్సేషన్ సెస్‌ను క్లియర్ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

జీఎస్టీ కౌన్సిల్ 49వ సమావేశం ముగిసిన వెంటనే విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

అకౌంటెంట్ జనరల్ (ఏజీ) సర్టిఫికేట్ సమర్పించిన ఆరు రాష్ట్రాలకు రూ.16,524 కోట్లు విడుదల చేయనున్నట్లు ఆమె తెలియజేశారు.

ఏజీ సర్టిఫికెట్లు సమర్పించిన ఆరు రాష్ట్రాల్లో ఢిల్లీ, తమిళనాడు, తెలంగాణ ఉన్నాయి.

ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో అప్పిలేట్ ట్రిబ్యునళ్ల ఏర్పాటు, పాన్ మసాలా, గుట్కా వ్యాపారాల్లో పన్ను ఎగవేతలను అరికట్టడం వంటి అంశాలపై చర్చించారు.

పాన్ మసాలాపై పన్ను విధింపుపై మంత్రుల బృందం (GoM) నివేదికను కౌన్సిల్ ఆమోదించింది.

సమావేశంలో, GST కౌన్సిల్, పెన్సిల్ షార్పనర్లు, కొన్ని ట్రాకింగ్ పరికరాలపై GSTని తగ్గించాలని నిర్ణయించింది. ఒక రకమైన ద్రవ బెల్లం వదులుగా విక్రయిస్తే వాటిపై జీఎస్టీని 18 శాతం నుంచిజీరోకు తగ్గించారు. ఇది ప్యాక్ చేసిడి, లేబుల్ చేస్తే, దానిపై పన్ను రేటు 5 శాతం ఉంటుంది.

జీఎస్టీ కౌన్సిల్ వార్షిక రిటర్నుల ఆలస్యంగా దాఖలు చేసినందుకు ఆలస్య రుసుమును హేతుబద్ధీకరించాలని కూడా కౌన్సిల్ సిఫార్సు చేసింది.

కోర్టులు, ట్రిబ్యునల్‌లు అందించే సేవలపై రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద పన్ను విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిందని సీతారామన్ చెప్పారు.

రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా జీఎస్టీ కౌన్సిల్ చైర్మన్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సమావేశానికి హాజరు కానందున ఆన్‌లైన్ గేమింగ్‌పై నివేదికను సమావేశంలో చర్చించలేదని ఆర్థిక మంత్రి తెలిపారు.

First Published:  19 Feb 2023 1:15 AM GMT
Next Story