Telugu Global
National

ట్విట్టర్ :భారతీయ ఉద్యోగుల శ్రమ దోపిడి చేస్తున్న ఎలాన్ మస్క్

భారత్ లో మిగిలిన 80 మంది ఉద్యోగులు చాలా కష్టాలను అనుభవిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు 250 మంది చేసిన పనిని ఇప్పుడు 80 మందే చేస్తున్నారు. రోజుకు 12 గంటల నుంచి 16 గంటల‌ వరకు పనిచేయాల్సి వస్తోంది. వేతనాలు కూడా ఏమీ పెంచకుండానే అధిక పనిగంటలు పని చేయిస్తున్నారు.

ట్విట్టర్ :భారతీయ ఉద్యోగుల శ్రమ దోపిడి చేస్తున్న ఎలాన్ మస్క్
X

ఈ ఏడాది అక్టోబరు చివరిలో ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుండి ట్విట్టర్ ఉద్యోగుల జీవితాలు చాలా కష్టతరంగా తయారయ్యాయి. కొనుగోలు చేసిన కొన్ని రోజుల తర్వాత, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలోని కార్యాలయాల్లో పనిచేస్తున్న ఎంతో మందిని ట్విట్టర్ తొలగించింది. కంపెనీ వెల్లడించనప్పటికీ, 250 మంది ట్విట్టర్ ఇండియా ఉద్యోగులలో దాదాపు 170 మంది ఉద్యోగులు ఈ సంస్థ నుండి వెళ్ళిపోయారు. ఇందులో ఎక్కువ మందిని మస్క్ తొలగించ‌గా కొందరు స్వచ్చందంగా రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు.

ఇక ఇప్పుడు మిగిలిన 80 మంది ఉద్యోగులు చాలా కష్టాలను అనుభవిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు 250 మంది చేసిన పనిని ఇప్పుడు 80 మందే చేస్తున్నారు. రోజుకు 12 గంటల నుంచి 16 గంటల‌ వరకు పనిచేయాల్సి వస్తోంది. వేతనాలు కూడా ఏమీ పెంచకుండానే అధిక పనిగంటలు పని చేయిస్తున్నారు. గతంలో భారత ట్విట్టర్ ఉద్యోగులకు సాయంత్రం స్నాక్స్ ఇచ్చే వాళ్ళు. మస్క్ రాగానే స్నాక్స్ ఇవ్వడం ఆపేశారు.

పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించినప్పటికీ వారి స్థానంలో కొత్తవాళ్ళను తీసుకునే ఆలోచన కూడా ఎలాన్ మస్క్ చేయడం లేదని ట్విట్టర్ వర్గాలు చెప్తున్నాయి. విపరీతమైన శ్రమ దోపిడి జరుగుతున్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో పని చేయాల్సి వస్తోందని ఉద్యోగులు బోరు మంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఆర్థిక మాంద్యం కారణంగా అన్ని కంపెనీలు కూడా ఉద్యోగులను తీసివేస్తుండటంతో , ప్రస్తుతం ఉద్యోగాలు దొరకడమే కష్టమై పోయింది. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్న మస్క్ శ్రమదోపిడికి తెరతీశాడనే ఆరోపణలు వస్తున్నాయి.

First Published:  16 Dec 2022 5:39 AM GMT
Next Story