Telugu Global
National

కాంగ్రెస్ కు మరో షాక్ -గోవాలో 8మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్!

గోవాలో కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు కొద్ది సేపట్లో బీజేపీలో చేరబోతున్నారు.

కాంగ్రెస్ కు మరో షాక్ -గోవాలో 8మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్!
X

అసలే రోజు రోజుకూ క్షీణిస్తున్న కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గోవాలో ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారు. అందులో మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, అసెంబ్లీలో కాంగ్రెస్ నేత మైఖేల్ లోబో కూడా ఉన్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దిగంబర్ కామత్, మైఖేల్ లోబో, అతని భార్య దెలీలా లోబో, రాజేష్ ఫాల్దేశాయి, కేదార్ నాయక్, సంకల్ప్ అమోంకర్, అలెక్సో సిక్వేరా, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్ బిజెపిలో చేరడానికి సిద్ధమయ్యారు. వీరంతా గోవా సీఎం ప్రమోద్ సావంత్ ను కొద్దిసేపటి క్రితం ఆయన చాంబర్‌లో కలిశారు. ఆయనతో చర్చల అనంతరం వారు గోవా శాసనసభకు చేరుకున్నారు. స్పీకర్ ను కలవనున్నారు.

గోవాలోని ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సదానంద్ షెట్ తనవాడే బుధవారం ప్రకటించారు.

40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 11 మంది, బీజేపీకి 20 మంది శాసనసభ్యులు ఉన్నారు. జూలై 2019లో కూడా ఇదే తరహాలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి మారారు.

గత ఎన్నికల్లో పోటీ చేసిన 37 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గుడి, దర్గా, చర్చిల వద్ద తాము ఎన్నికల్లో గెలిస్తే ఇతర పార్టీలకు ఫిరాయించబోమని ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు పార్టీ ఫిరాయిస్తున్న ఎనిమిది మంది కూడా ప్రతిజ్ఞ చేసినవారిలో ఉన్నారు.

First Published:  14 Sep 2022 6:37 AM GMT
Next Story