Telugu Global
National

ఎలక్షన్ డ్యూటీ తప్పించుకోడానికి ఏకంగా..

ఎన్నికల నియమావళిలోని ఆ లొసుగుని ఉపయోగించుకుని వారు డ్యూటీలు ఎగ్గొట్టడానికి బ్రహ్మాండమైన ఐడియా వేశారు. ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది.

ఎలక్షన్ డ్యూటీ తప్పించుకోడానికి ఏకంగా..
X

ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు డ్యూటీలు తప్పనిసరి. కొన్నిసార్లు కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవల్ని కూడా వినియోగించుకుంటారు. ఇష్టం లేకపోయినా ఎలక్షన్ డ్యూటీలు చేయాల్సిందే. అయితే ఈ డ్యూటీలు ఎగ్గొట్టేందుకు విద్యావాలంటీర్లుగా పనిచేస్తున్న కొంతమంది ఓ ఎత్తుగడ వేశారు. వారు చేసిన పని ఏంటనేది తెలిస్తే కచ్చితంగా షాకవ్వాల్సిందే. ఎన్నికల నియమావళిలోని ఆ లొసుగుని ఉపయోగించుకుని వారు డ్యూటీలు ఎగ్గొట్టడానికి బ్రహ్మాండమైన ఐడియా వేశారు. ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది.

పశ్చిమ బెంగాల్‌ లో ఈనెల 8వ తేదీన పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలకోసం ఉపాధ్యాయులతోపాటు, విద్యావాలంటీర్ల సేవలను కూడా వినియోగించుకుంటోంది ప్రభుత్వం. అయితే అలిపురద్వార్ జిల్లా జటేశ్వర్ గ్రామానికి చెందిన ఏడుగురు విద్యావాలంటీర్లు ఈ డ్యూటీలను తప్పించుకోవాలని ప్లాన్ చేశారు. ఆ ఏడుగురి ఇళ్లలో వివాహ వేడుకలు ఉండటంతో వారికి సెలవు పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఎలక్షన్ డ్యూటీ కాబట్టి దాన్ని ఎగ్గొట్టే అవకాశం లేదు. దీంతో వారు మాస్టర్ ప్లాన్ వేశారు. తాము అడగకుండా అధికారులే సెలవు ఇచ్చేలా చేశారు.

ఎలాగంటే..?

జటేశ్వర్ గ్రామానికి చెందిన ఏడుగురు యువకులు చుట్టుపక్కల గ్రామాల్లో విద్యావాలంటీర్లుగా పనిచేస్తున్నారు. ఈనెల 5నుంచి 7వతేదీ వరకు వారి ఇళ్లలో వివాహ వేడుకలు జరుగుతున్నాయి. ఎనిమిదో తేదీ ఎలక్షన్ డ్యూటీ చేయడం వారికి ఇష్టం లేదు. దీంతో వారంతా జటేశ్వర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి నిలబడ్డారు. సర్పంచ్ పదవికోసం స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. అభ్యర్థులు కాబట్టి, ఎన్నికలకు సంబంధించిన విధులకు వారిని దూరం పెట్టాల్సిన పరిస్థితి. సెలవకు దరఖాస్తు చేయకుండానే, అధికారులను ఒక్క మాట అడగకుండానే వారికి డ్యూటీలు క్యాన్సిల్ అయ్యాయి. ఈ మాస్టర్ ప్లాన్ చూసి అధికారులే షాకయ్యారు.

First Published:  4 July 2023 7:54 AM GMT
Next Story