Telugu Global
National

మళ్లీ డ్యూటీ ఎక్కిన ఈడీ.. చత్తీస్‌ఘడ్ సీఎం సన్నిహితులు టార్గెట్..

కాంగ్రెస్ పాలిత చత్తీస్ ఘడ్ లో సోదాలు జరుగుతున్నాయి. సీఎం భూపేష్ భగేల్ సన్నిహితులైన అధికారులపై ఈడీ ఫోకస్ పెట్టింది. వారి ఇళ్లలో, కార్యాలయాల్లో దాడులు చేపట్టింది.

మళ్లీ డ్యూటీ ఎక్కిన ఈడీ.. చత్తీస్‌ఘడ్ సీఎం సన్నిహితులు టార్గెట్..
X

దేశవ్యాప్తంగా ఈడీ, సీబీఐ సోదాలు జరిగాయంటే.. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే అని కచ్చితంగా చెప్పొచ్చు. ఒకవేళ బీజేపీ పాలిత రాష్ట్రంలో దాడులు జరిగాయి అంటే కచ్చితంగా అది ప్రతిపక్ష పార్టీ నేతలపైనే అని నిర్ధారణకు వచ్చేయొచ్చు. తాజాగా ఈరోజు ఈడీ సోదాలు జరిగాయనే వార్తలు బయటకొచ్చాయి. కాంగ్రెస్ పాలిత చత్తీస్ ఘడ్ లో ఈ సోదాలు జరుగుతున్నాయి. సీఎం భూపేష్ భగేల్ సన్నిహితులైన అధికారులపై ఈడీ ఫోకస్ పెట్టింది. వారి ఇళ్లలో, కార్యాలయాల్లో దాడులు చేపట్టింది.

చత్తీస్ ఘడ్ సీఎంకు సన్నిహితులుగా పేరున్న సౌమ్యా చౌరాసియా, సీఏ విజయ్ మాలు, రాయగడ్ కలెక్టర్ రాను సాహు, అగ్నిచంద్రాకర్, సూర్యకాంత్ తివారి, గనుల శాఖ డైరెక్టర్ జేపీ మౌర్య ఇళ్లలో ఈడీ అధికారులు ఈరోజు ఉదయం 5 గంటల నుంచి సోదాలు మొదలు పెట్టారు. అధికారులతో పాటు కాంగ్రెస్ నేతలు, వ్యాపారవేత్తల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు.

కక్ష ఎందుకంటే..?

ఆమధ్య జార్ఖండ్ సంక్షోభంలో జేఎంఎం ఎమ్మెల్యేలు చేజారకుండా సీఎం హేమంత్ సోరెన్, చత్తీస్ ఘడ్ లో క్యాంప్ రాజకీయాలు నడిపారు. ఆ విషయంలో చత్తీస్ ఘడ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం హేమంత్ సోరెన్ కి పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చింది. అప్పటినుంచి చత్తీస్ ఘడ్ సీఎంని కూడా బీజేపీ టార్గెట్ చేసింది. సహజంగానే కాంగ్రెస్ నేతల్ని కేసులతో భయపెడుతున్నారు కాబట్టి చత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ భగేల్ పూర్తిగా కార్నర్ అయ్యారు. అందుకే అక్కడ వరుసగా సోదాలు జరుగుతున్నాయి. తాజా సోదాలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇవి రాజకీయ ప్రతీకార దాడులు అంటూ ఆరోపిస్తున్నారు.

First Published:  11 Oct 2022 9:11 AM GMT
Next Story