Telugu Global
National

ఫ్లైట్ లో ఇండియన్ ప్యాసింజర్ గలీజ్ పని.. తోటి ప్రయాణికుడితో గొడవపడి అతడిపై మూత్ర విసర్జన

తోటి ప్రయాణికులు సర్ది చెప్పినా ఇండియన్ ప్యాసింజర్ ఆగ్రహం చల్లారలేదు. తోటి ప్రయాణికుడితో గొడవపడిన కాసేపటి తర్వాత అతడిపై ఇండియన్ ప్యాసింజర్ మూత్ర విసర్జన చేశాడు.

ఫ్లైట్ లో ఇండియన్ ప్యాసింజర్ గలీజ్ పని.. తోటి ప్రయాణికుడితో గొడవపడి అతడిపై మూత్ర విసర్జన
X

ఈ మధ్య విమానాల్లో జరుగుతున్న సంఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్యాసింజర్ ల ప్రవర్తన విస్తుపోయేలా చేస్తోంది. ఒకడేమో విమానంలో తోటి ప్రయాణికురాలిపై తాగిన మత్తులో మూత్రం పోశాడు. మరొకడేమో సిగరెట్ తాగాడు. ఇంకొకడు ఎయిర్ హోస్టెస్ ను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. ఇంకొందరైతే విమానంలో సీట్ల కోసం కొట్టుకున్నారు. ప్రస్తుతం ఇలాంటి సంఘటనలు విమానాల్లో నిత్యం జరుగుతున్నాయి.

తాజాగా న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో ఒక భారత ప్రయాణికుడు గలీజ్ పని చేశాడు. తనతో గొడవపడిన తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అమెరికాలోని జాన్ఎఫ్ కెన్నెడి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి అమెరికన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 292 ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు బయలుదేరింది. అయితే విమానం టేకాఫ్ అయిన కొంతసేపటికి ఒక ఇండియన్ ప్యాసింజర్, మరొక ప్యాసింజర్ మధ్య వాగ్వాదం తలెత్తింది. ఇది కాస్త కొట్లాటకు దారి తీసింది.

తోటి ప్రయాణికులు సర్ది చెప్పినా ఇండియన్ ప్యాసింజర్ ఆగ్రహం చల్లారలేదు. తోటి ప్రయాణికుడితో గొడవపడిన కాసేపటి తర్వాత అతడిపై ఇండియన్ ప్యాసింజర్ మూత్ర విసర్జన చేశాడు. ఈ సంఘటనతో ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు బిత్తర పోయారు. అతడి వింత ప్రవర్తన చూసి షాకయ్యారు. ఇంత చిన్న గొడవకే అంత పని చేయాలా? అని ఆశ్చర్యపోయారు. విమానం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అమెరికన్ ఎయిర్ లైన్స్ సిబ్బంది ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సదరు ఇండియన్ ప్యాసింజర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

First Published:  25 April 2023 5:21 AM GMT
Next Story