Telugu Global
National

డ్రోన్ చూస్తోంది.. చలాన్ పడుతుంది జాగ్రత్త

బెంగళూరులో ట్రాఫిక్ నిర్వహణకు ఇటీవల డ్రోన్ కెమెరాల వాడకం విజయవంతమైంది. దీంతో వీటి ద్వారా హైవేలపై కూడా వాహనాల స్పీడ్ అంచనా వేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు.

డ్రోన్ చూస్తోంది.. చలాన్ పడుతుంది జాగ్రత్త
X

అతి వేగం, మద్యపానం తాగి డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, సీట్ బెల్ట్ లేకుండా కారు నడపడం.. వీటిల్లో ఏది చేసినా ట్రాఫిక్ పోలీసుల చలానా తప్పదు. కొంతమంది సీసీ కెమెరాల ముందు, స్పీడ్ గన్లు ఉన్న ప్రాంతాల్లో మాత్రం బుద్ధిమంతుల్లా బిల్డప్ ఇచ్చి, మిగతా చోట్ల ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తారు. అయితే ఇకపై ఇలాంటి వెసులుబాటు కూడా ఉండదు. నిత్యం డ్రోన్ కెమెరాలు వాహనాల స్పీడ్ ని గమనించేలా కొత్త రూల్స్ వచ్చేశాయి.

బెంగళూరులో సక్సెస్..

బెంగళూరులో ట్రాఫిక్ నిర్వహణకు ఇటీవల డ్రోన్ కెమెరాల వాడకం విజయవంతమైంది. దీంతో వీటి ద్వారా హైవేలపై కూడా వాహనాల స్పీడ్ అంచనా వేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు. బెంగళూరు–మైసూరు ఎక్స్‌ప్రెస్‌ వేపై ఈ ప్రయోగం మొదలు పెడుతున్నారు. హైవేలపై ఓవర్ స్పీడ్ తో వెళ్లే వాహనాలను ఈ డ్రోన్ కెమెరాలు పసిగడతాయి. ఆ ఫుటేజ్ సాయంతో దగ్గర్లోని టోల్ గేట్ల వద్ద సిబ్బంది అలర్ట్ అవుతారు. ఓవర్ స్పీడ్ వాహనాలకు చలాన్లు విధిస్తారు.

బెంగళూరు–మైసూరు ఎక్స్‌ప్రెస్‌ వే ఇటీవల ప్రమాదాల సంఖ్య పెరిగింది. కేవలం 9 నెలల కాలంలో 590 ప్రమాదాలు సంభవించగా దాదాపు 158 మంది చనిపోయారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదాలు జరిగాయని పోలీసుల వద్ద పక్కా సమాచారముంది. దీంతో ఈ వేగ నియంత్రణపై పోలీసులు దృష్టిపెడుతున్నారు. డ్రోన్ల నిఘా ఉందని తెలిస్తే వాహనదారులు ఓవర్ స్పీడ్ తో వెళ్లరనేది పోలీసుల ఆలోచన. బెంగళూరు–మైసూరు ఎక్స్‌ ప్రెస్‌ వే, తుమకూరు–చిత్రదుర్గ, ఉడుపి–మంగళూరు, ధార్వాడ–బెళగావి జాతీయ రహదారుల వద్ద తొలి దశలో డ్రోన్లు వినియోగించాలని నిర్ణయించారు. కర్నాటకలోని పలు జిల్లాల్లో 2 కోట్ల రూపాయల విలువ చేసే డ్రోన్‌ కెమెరాల సరఫరాకు సంబంధించి పోలీస్‌ శాఖకు రోడ్డు భద్రత సంచార విభాగం ప్రతిపాదనలు అందజేసింది.

First Published:  2 July 2023 7:43 AM GMT
Next Story