Telugu Global
National

Vani Jayaram: గాయని వాణీ జయరాం మృతిపై అనుమానాలు

Doubts on singer Vani Jayaram death: ఈ రోజు 11 గంటల‌ ప్రాంతంలో వాణీ జయరాం ఇంటికి వచ్చిన పని మనిషి ఎంత సేపు తలపు కొట్టినా తెరవకపోవడంతో చుట్టుపక్కల వాళ్ళతో కలిసి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్ళగా వాణీ జయరాం రక్తం మడుగులో కింద పడిపోయి ఉంది.

Vani Jayaram: గాయని వాణీ జయరాం మృతిపై అనుమానాలు
X

ప్రముఖ గాయని వాణీ జయరాం ఈ రోజు ఉదయం మరణించారు. అయితే ఆమె మరణంపై అనేక అనుమానాలు వ్యక్త‌మవుతున్నాయి. ఆమె తలకు గాయాలుండటం, తల రక్తంతో తడిసి పోయి ఉండటంతో ఆమె మరణంపై అనుమానాలు వస్తున్నాయి.

ఈ రోజు 11 గంటల‌ ప్రాంతంలో వాణీ జయరాం ఇంటికి వచ్చిన పని మనిషి ఎంత సేపు తలపు కొట్టినా తెరవకపోవడంతో చుట్టుపక్కల వాళ్ళతో కలిసి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్ళగా వాణీ జయరాం రక్తం మడుగులో కింద పడిపోయి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించి, ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు తెలిపారు.

ఆమెపై ఎవరో దాడి చేసినట్టు ఉందని పని మనిషి మీడియాతో చెప్పారు. అయితే ఆమె మరణానికి కారణమేమయ్యి ఉంటుందని పోలీసులు విచారిస్తున్నారు. ఎవరైనా దాడి చేశారా లేక ఆమె కిందపడి గాయాలయ్యాయా అనేది పోలీసులు పరిశీలిస్తున్నారు. సీసీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. అయితే కాలు జారి కిందపడి తలకు గాయమయ్యి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Next Story