Telugu Global
National

ప్రధాని ఏం చదివారో తెలుసుకునే హక్కు ఈ దేశ ప్రజలకు లేదా ? -కేజ్రీవాల్

హైకోర్టు తీర్పుపై కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ.. 'ప్రధాని ఎంత చదువుకున్నాడో తెలుసుకునే హక్కు కూడా దేశానికి లేదా.. డిగ్రీని కోర్టులో చూపించడాన్ని మోడీ అంత తీవ్రంగా ఎందుకు వ్యతిరేకించారు?.. ఆయన డిగ్రీ చూడాలని డిమాండ్ చేసే వారికి జరిమానా విధిస్తారా? ఈ దేశంలో ఏం జరుగుతోంది?" అని కామెంట్ చేశారు.

ప్రధాని ఏం చదివారో తెలుసుకునే హక్కు ఈ దేశ ప్రజలకు లేదా ? -కేజ్రీవాల్
X

ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీకి సంబంధించిన సమాచారం ఇవ్వాలంటూ కేంద్ర సమాచార కమిషన్‌ ఆదేశాలను గుజరాత్‌ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యం ప్రధానికి విద్యార్హత తెలుసుకునే హక్కు దేశానికి లేదా అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సిఐసి) ఏడేళ్ల కింద ఇచ్చిన ఉత్తర్వులపై గుజరాత్ విశ్వవిద్యాలయం అప్పీల్ కు వెళ్ళగా, సిఐసి ఆదేశాలను కొట్టివేసిన జస్టిస్ బిరెన్ వైష్ణవ్, కేజ్రీవాల్‌పై రూ. 25,000 జరిమానా విధించారు. ఆ మొత్తాన్ని నాలుగు వారాల్లోగా గుజరాత్ స్టేట్ లీగల్ సర్వీసెస్‌కు జమ చేయాలని కోరారు.

హైకోర్టు తీర్పుపై కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ.. 'ప్రధాని ఎంత చదువుకున్నాడో తెలుసుకునే హక్కు కూడా దేశానికి లేదా.. డిగ్రీని కోర్టులో చూపించడాన్ని మోడీ అంత తీవ్రంగా ఎందుకు వ్యతిరేకించారు?.. ఆయన డిగ్రీ చూడాలని డిమాండ్ చేసే వారికి జరిమానా విధిస్తారా? ఈ దేశంలో ఏం జరుగుతోంది?" అని కామెంట్ చేశారు.

“నిరక్షరాస్యులైన లేదా తక్కువ చదువుకున్న ప్రధాని దేశానికి చాలా ప్రమాదకరం” అని కేజ్రీవాల్ ట్వీట్‌లో ఆరోపించారు.

First Published:  31 March 2023 4:28 PM GMT
Next Story