Telugu Global
National

మహిళా రిజర్వేషన్‌ బిల్లు గురించి ఈ విషయాలు తెలుసా..?

కేంద్ర కేబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ బిల్లును పార్లమెంట్ క్లియర్ చేస్తే చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వ్ కానున్నాయి.

మహిళా రిజర్వేషన్‌ బిల్లు గురించి ఈ విషయాలు తెలుసా..?
X

దేశ రాజకీయాల్లో మహిళల ప్రాతినిథ్యం క్రమంగా పెరుగుతోంది. అయితే చట్టసభల్లో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు దాదాపు 27 ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉంటూ వస్తోంది. తాజాగా కేంద్ర కేబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ బిల్లును పార్లమెంట్ క్లియర్ చేస్తే చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వ్ కానున్నాయి.

మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..!

♦ 1996, సెప్టెంబర్‌ 12న HD దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఈ బిల్లును మొదటిసారి లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

♦ చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించడం ఈ బిల్లు ప్రధాన లక్ష్యం.

♦ ఈ బిల్లు ప్రకారం.. మహిళలకు సీట్లు రోటేషనల్ పద్ధతిలో రిజర్వ్ చేస్తారు. వరుసగా ప్రతి మూడు సార్వత్రిక ఎన్నికల్లో ఒకసారి మహిళలకు లాట్‌ డ్రా పద్ధతిలో సీట్ రిజర్వ్ చేస్తారు.

♦ మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం వాజ్‌పేయి సర్కార్ ప్రయత్నాలు చేసినప్పటికీ అది సాకారం కాలేదు.

♦ కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఎ-1 ప్రభుత్వం.. 2008 మేలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును తిరిగి పార్లమెంట్‌ ముందుకు తెచ్చింది.

♦ అయితే ఈ బిల్లు తిరిగిప్రవేశపెట్టిన తర్వాత.. 2010, మార్చి 9న రాజ్యసభ ఆమోదించింది. లోక్‌సభలో అప్పటినుంచి పెండింగ్‌లోనే ఉంది.

♦ అప్పట్లో లాలు ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ, ములాయం నేతృత్వంలోని సమాజ్‌ వాదీ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు స్పెషల్ కోటా ఉండాలని ఆ పార్టీలు డిమాండ్ చేశాయి.

మహిళా రిజర్వేషన్ బిల్లు ఆలోచనకు 1993లో చేసిన రాజ్యాంగ సవరణతో బీజం పడింది. ఆ రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామ పంచాయతీల్లో మూడింట ఒక వంతు పదవులను మహిళలకు రిజర్వ్ చేయాలని నిర్ణయించారు. లాంగ్‌టైంలో ఈ రిజర్వేషన్లను లోక్‌సభతో పాటు శాసనసభలకు వర్తింపజేయాలని మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపాదించారు.

బిల్లు ప్రస్తుత పరిస్థితి..!

ప్రస్తుతం బిల్లు లోక్‌సభలో పెండింగ్‌లో ఉంది. ప్రస్తుత ఎన్డీఏ సర్కార్‌కు లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీ ఉండటంతో బిల్లు ఆమోదం పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం లోక్‌సభలో బీజేపీకి సొంతంగా 300కు పైగా ఎంపీలున్నారు.

First Published:  19 Sep 2023 3:14 AM GMT
Next Story