Telugu Global
National

స్టాలిన్ అద్వర్యంలో సోమవారం చెన్నైలో ప్రతిపక్షాల సమావేశం...హాజరుకానున్న బీఆరెస్, వైఎస్సార్ సీపీలు

దాదాపు 20 ప్రతిపక్ష పార్టీల నాయకులు చెన్నైలో జరిగే ఈ సమావేశానికి వ్యక్తిగతంగా హాజరవుతున్నారు. ఈ సమావేశంలో భారతదేశంలో సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకెళ్లడం ఎలా అనే అంశంపై చర్చ జరుగుతుంది.

స్టాలిన్ అద్వర్యంలో సోమవారం చెన్నైలో ప్రతిపక్షాల సమావేశం...హాజరుకానున్న బీఆరెస్, వైఎస్సార్ సీపీలు
X

భాజపాయేతర పార్టీలను ఏకంచేసే ప్రయత్నాల్లో భాగంగా సామాజిక న్యాయం అనే అంశంపై చర్చించేందుకు ద్రావిడ మున్నేట్ర కజగం (డిఎంకె) అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సోమవారం చెన్నైలో ప్రతిపక్ష పార్టీల సమావేశానికి పిలుపునిచ్చారు. .

దాదాపు 20 ప్రతిపక్ష పార్టీల నాయకులు చెన్నైలో జరిగే ఈ సమావేశానికి వ్యక్తిగతంగా హాజరవుతున్నారు. ఈ సమావేశంలో భారతదేశంలో సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకెళ్లడం ఎలా అనే అంశంపై చర్చ జరుగుతుంది.

జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌, రాష్ట్రీయ జనతాదళ్ ఛీఫ్ తేజస్వీ యాదవ్‌, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్, భారత రాష్ట్ర సమితి నాయకుడు కె కేశవరావు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎ సురేష్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా, బిజూ జనతా దళ్ నేత సస్మిత్ పాత్రో, సీపీఐ(ఎం) ప్రధాన కాఎయదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి డెరెక్‌ ఓబ్రెయిన్‌ హాజరవుతున్నట్లు ధృవీకరించారు.

YSRCP, BJD లు మొదటిసారిగా ఇటువంటి సమావేశానికి హాజరు కానున్నాయి.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశమైన నేపథ్యంలో BJD కూడా ఈ సమావేశంలో పాల్గొనాలని నిర్ణయించుకుంది.

కాంగ్రెస్, ఆప్ లు కూడా ఈ సమావేశానికి తమ ప్రతినిధులను పంపనున్నాయి. అయితే ఎవరొస్తారన్నది ఇంకా నిర్ణయం కాలేదు. ఎన్‌సిపి, శివసేన (యుబిటి) లు ఈ సమావేశంలో పాల్గొంటాయా లేదా అనేది ఇంకా స్పష్టం చేయలేదు.

First Published:  31 March 2023 5:49 AM GMT
Next Story