Telugu Global
National

సీఎం కావాలన్న తొందర లేదు.. మీ ఆఫర్ నాకొద్దు

టీసీఎం అంటే టెంపరరీ చీఫ్ మినిస్టర్ అని సిద్ధరామయ్య కర్నాటకకు టీసీఎం అని చెప్పారు. డీసీఎం అంటే డూప్లికేట్ చీఫ్ మినిస్టర్ అని, డీకే శివకుమార్ డీసీఎం అని అన్నారు కుమారస్వామి.

సీఎం కావాలన్న తొందర లేదు.. మీ ఆఫర్ నాకొద్దు
X

కర్నాటకలో సడన్ గా పొలిటికల్ అలజడి, కొన్నిరోజులుగా నేనంటే నేనంటూ చాలామంది సీఎం అభ్యర్థులు కాంగ్రెస్ నుంచి తెరపైకి వచ్చారు. ఢిల్లీలో పంచాయితీ జరిగిందన్నారు, కర్నాట కాంగ్రెస్ లో లుకలుకలు మొదలయ్యాయని అంటున్నారు. ఈ మధ్యలో జేడీఎస్ సడన్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతానంటే తమ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతిస్తారంటూ బాంబు పేల్చారు కుమారస్వామి. అయితే డీకే ఈ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించారు. తనకు సీఎం కావాలన్న తొందర లేదన్నారు. ఆయన ఆఫర్ ని వద్దని చెప్పేశారు.

కుమారస్వామి ప్లాన్ ఏంటి..?

వాస్తవానికి డీకే శివకుమార్ కి కుమారస్వామి ఆఫరేమీ ఇవ్వలేదు. పదే పదే జేడీఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోతారంటూ వైరి వర్గం టార్గెట్ చేస్తుంటే.. కుమార స్వామి సెటైరిక్ గా మాట్లాడారు. మా ఎమ్మెల్యేలు మీ పార్టీలో ఎందుకు చేరతారని నిలదీశారు. అంత ఆశగా ఉంటే, డీకే శివకుమార్ సీఎం అవుతానంటే తమ పార్టీకి చెందిన 19మంది ఎమ్మెల్యేలు మద్దతిస్తారని చెప్పారు. అయితే ఆ ఆఫర్ ని హైలైట్ చేస్తూ.. కాంగ్రెస్ పై తనకున్న విధేయత చూపెట్టాలనుకున్నారు డీకే. అందుకే ఆ ఆఫర్ తనకు వద్దన్నారు.

టీసీఎం, డీసీఎం..

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సీఎం, డిప్యూటీ సీఎంలకు పేర్లు పెట్టి మరీ కామెంట్ చేశారు కుమారస్వామి. టీసీఎం అంటే టెంపరరీ చీఫ్ మినిస్టర్ అని సిద్ధరామయ్య కర్నాటకకు టీసీఎం అని చెప్పారు. డీసీఎం అంటే డూప్లికేట్ చీఫ్ మినిస్టర్ అని, డీకే శివకుమార్ డీసీఎం అని అన్నారు. కాంగ్రెస్ లో చాలామందికి ముఖ్యమంత్రి కావాలనే కల ఉందని, ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే సీఎం మార్పు ఖాయమని తెలుస్తోందని అన్నారు కుమారస్వామి. ఆయన వ్యాఖ్యలపై డీకే స్పందించడంతో ఈ వ్యవహారానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడినట్టయింది.

First Published:  5 Nov 2023 1:37 PM GMT
Next Story