Telugu Global
National

RGV: శ్రద్ధా ఆత్మగా తిరిగొచ్చి ఆఫ్తాబ్ ని 70 ముక్కలుగా నరకాలి.. ఆర్జీవీ ట్వీట్

Ram gopal varma tweet on Shraddha Walker: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా వెరైటీనే. ప్రతి విషయాన్ని అతడు వివాదం చేస్తుంటాడు.

Ram gopal varma
X

Ram gopal varma

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా వెరైటీనే. ప్రతి విషయాన్ని అతడు వివాదం చేస్తుంటాడు. ఆఖరికి నిన్న కృష్ణ మరణంపై కూడా వివాదాస్పద ట్వీట్ చేసి నెటిజన్లతో తిట్లు తిన్నాడు. తాజాగా అతడు ఢిల్లీలో తన ప్రియురాలిని యువకుడు నరికి చంపిన ఘటనపై స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన దేవుడికి ఒక వింత అభ్యర్థన చేశాడు. శ్రద్ధావాకర్ ఆత్మగా తిరిగి వచ్చి తనని 35 ముక్కలుగా నరికి చంపిన ఆఫ్తాబ్ ను 70 ముక్కలుగా నరికి చంపేలా చూడాలని కోరాడు.

'బాధిత యువతి చనిపోయి ఎక్కడో విశ్రాంతి తీసుకునే బదులుగా ఆత్మగా తిరిగి వచ్చి నిందితుడిని 70 ముక్కలుగా నరకాలి. ఇలాంటి సంఘటనలు, హత్యలు కేవలం కేసులు, చట్టాల భయంతో ఆపలేం. చనిపోయిన వారు తిరిగి ఆత్మలుగా వచ్చి తమను చంపినవారిని చంపితే ఇటువంటి ఘటనలను కచ్చితంగా ఆపవచ్చు. దేవుడు దీనిని పరిశీలించి అటువంటి వారికి అవకాశం కల్పించాలని కోరుతున్నాను.' అని ట్వీట్ చేశాడు.



దేవుడికి రాంగోపాల్ వర్మ వింత అభ్యర్థన చేస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా వర్మ చేసిన కామెంట్స్ కి కొందరు నెటిజన్లు మద్దతు తెలుపగా మరి కొందరు మాత్రం ఆఫ్తాబ్ క్రైమ్ వెబ్ సిరీస్ చూసి తన ప్రియురాలిని ముక్కలు ముక్కలుగా నరికాడని..అలాంటి క్రైమ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు నువ్వు కూడా చేసి ఆఫ్తాబ్ వంటి వారిని మోటివేట్ చేస్తున్నావ్..అంటూ వర్మపై సెటైర్లు వేశారు.

First Published:  16 Nov 2022 3:10 PM GMT
Next Story