Telugu Global
National

ఢిల్లీ లిక్కర్ కేసు అంతా ఫేక్..... కేజ్రీవాల్

''మద్యం పాలసీ కేసు అబద్ధం, కల్పితం. ఆమ్‌ ఆద్మీ పార్టీ నిజాయితీగల జాతీయ పార్టీ , ఆప్‌ను లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నారు. నిజాయితీ మా సిద్ధాంతం. మేము చేస్తున్న మంచి, అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక పరువు తీసేందుకు ఇదంతా చేస్తున్నారు.'' అని కేజ్రీవాల్ ఆరోపించారు.

ఢిల్లీ లిక్కర్ కేసు అంతా ఫేక్..... కేజ్రీవాల్
X

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ప్రశ్నించింది. దాదాపు 9 గంటలకు పైగా సీబీఐ విచారించిన అనంతరం కేజ్రీవాల్ తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.

ఢిల్లి లిక్కర్ కేసు మొత్తం ఫేక్ అని ఆయన స్పష్టం చేశారు. ''మద్యం పాలసీ కేసు అబద్ధం, కల్పితం. ఆమ్‌ ఆద్మీ పార్టీ నిజాయితీగల జాతీయ పార్టీ , ఆప్‌ను లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నారు. నిజాయితీ మా సిద్ధాంతం. మేము చేస్తున్న మంచి, అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక పరువు తీసేందుకు ఇదంతా చేస్తున్నారు.'' అని కేజ్రీవాల్ ఆరోపించారు. సీబీఐ తనను 56 ప్రశ్నలు అడిగిందని ప్రతి ప్రశ్నకు తాను స్పష్టమైన జవాబు ఇచ్చానని కేజ్రీవాల్ చెప్పారు.

కాగా, నిన్న 9 గంటలకు పైగా కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించడంతో ఆయనను అరెస్టు చేస్తారనే వార్తలు షికార్లు చేశాయి. సీబీఐ విచారణకు నిరసనగా ఆప్ కార్యకర్తలు, నాయకులు ధర్నాకు దిగారు. మరో వైపు పార్టీ సీనియర్ నేతలు నిన్న అత్యవసరంగా సమావేశమయ్యారు. ఒక వేళ కేజ్రీవాల్ ను అరెస్టు చేస్తే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

First Published:  17 April 2023 1:35 AM GMT
Next Story