Telugu Global
National

తీహార్ జైలుకు కేజ్రీవాల్.. ఏప్రిల్‌ 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ

ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహా ఇప్పటివరకూ ముగ్గురు ఆప్ నేతలు అరెస్టయ్యారు. గతంలోనే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో పాటు రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ను అరెస్టు చేశారు అధికారులు.

తీహార్ జైలుకు కేజ్రీవాల్.. ఏప్రిల్‌ 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ
X

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది. ఈడీ కస్టడీ ముగియడంతో ఇవాళ కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరిచారు అధికారులు. జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని రౌస్ ఎవెన్యూ కోర్టును కోరారు. ఈడీ విజ్ఞప్తిపై స్పందించిన కోర్టు ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించింది. దీంతో రాబోయే రెండు వారాల పాటు తీహార్ జైలులో గడపనున్నారు అరవింద్‌ కేజ్రీవాల్. కోర్టుకు తరలించే ముందు కేజ్రీవాల్ తన భార్యను, మంత్రులు ఆతిషి, సౌరభ్ భరద్వాజ్‌లను కలిసేందుకు అనుమతి ఇచ్చింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు ఈడీ అధికారులు. అప్పటి నుంచి ఆయన ఈడీ కస్టడీలోనే ఉన్నారు. ఇక తన అరెస్టును రాజకీయ కుట్రగా అభివర్ణించారు కేజ్రీవాల్‌. సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ కేజ్రీవాల్ అరెస్టు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహా ఇప్పటివరకూ ముగ్గురు ఆప్ నేతలు అరెస్టయ్యారు. గతంలోనే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో పాటు రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ను అరెస్టు చేశారు అధికారులు. ఈ కేసులో కవితకు ఈ నెల 9 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే.

First Published:  1 April 2024 7:37 AM GMT
Next Story