Telugu Global
National

ఢిల్లీ అల్లర్ల కేసు: జేఎన్యూ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్ నిర్దోషి -కోర్టు తీర్పు

ఖజూరి ఖాస్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్, ఖలీద్ సైఫీ లు నిర్దోషులంటూ అదనపు సెషన్స్ జడ్జి పులస్త్య ప్రమాచల ఉత్తర్వులు జారీ చేశారు.

ఢిల్లీ అల్లర్ల కేసు: జేఎన్యూ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్ నిర్దోషి -కోర్టు తీర్పు
X

2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన కేసులో JNU మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్, యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్ సభ్యుడు ఖలీద్ సైఫీని ఢిల్లీ కోర్టు శనివారం విడుదల చేసింది. అయితే, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం (UAPA) కేసులో వారికి ఇంకా బెయిల్ లభించనందున వారు జ్యుడీషియల్ కస్టడీలోనే కొనసాగుతారు.

ఖజూరి ఖాస్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ అల్లర్ల కేసులో వీరిద్దరూ నిర్దోషులంటూ అదనపు సెషన్స్ జడ్జి పులస్త్య ప్రమాచల ఉత్తర్వులు జారీ చేశారు.

అల్లర్ల సమయంలో చాంద్‌బాగ్ ప్రాంతంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ వాంగ్మూలం ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. అక్కడే ఉన్న కానిస్టేబుల్ తనను తాను రక్షించుకోవడానికి స్థానిక పార్కింగ్ స్థలంలోదాక్కొనప్పుడు ఒక గుంపు పార్కింగ్ స్థలం షట్టర్‌ను పగలగొట్టి, లోపల ఉన్న వ్యక్తులపై దాడి చేసి వాహనాలకు నిప్పు పెట్టిందని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.

మాజీ ఆప్‌ కౌన్సిలర్‌ తాహిర్‌ హుస్సేన్‌కు చెందిన భవనంలోంచే అల్లరి మూకలు రాళ్లు రువ్వారని ప్రాసిక్యూషన్‌ పేర్కొంది. ఈ మొత్తం అల్లర్ల కుట్రలో ఉమర్ ఖలీద్, ఖలీద్ సైఫీ భాగస్తులని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.

కోర్టు ఉత్తర్వులపై ఉమర్ తండ్రి SQR ఇలియాస్ మాట్లాడుతూ, "రెండేళ్ళ సుదీర్ఘ కాలం ఉమర్ జైలులో ఉన్నాడు, మాకు ఇప్పుడే ఈ శుభవార్త వచ్చింది. ఈ తీర్పు మా న్యాయ బృందం యొక్క గట్టి పట్టుదల ఫలితం. ఉమర్ అంతకుముందు బెయిల్ కూడా పొందాడు. అతను UAPA కేసులో కస్టడీలో ఉన్నాడు. రెండు కేసులలో ఆరోపణలు ఒకే విధంగా ఉన్నాయి. యూఏపీఏ కేసులో కూడా ఉమర్ ను విడుదల చేస్తారని ఆశిస్తున్నాం.'' అని అన్నారు.

ఖలీద్ సైఫీ భార్య నర్గీస్ స్పందిస్తూ, "వారు తప్పుడు కేసు పెట్టారు. చాలా కాలం తర్వాత మేము విజయం సాధించాము. ఇది పోలీసులకు చెంపపెట్టు. చాలా కాలం తర్వాత దేవుడిచ్చిన వరం ఇది. నా ఆనందాన్ని నేను చెప్పలేను." అని సంతోషం వ్యక్తం చేశారు.

First Published:  3 Dec 2022 12:12 PM GMT
Next Story