Telugu Global
National

దావూద్ అనుచరుడి రక్తం తాగుతున్న దోమలు, చంపిన దోమలతో కోర్టుకు..

తాను ఈ దోమల దాడిని తట్టుకోలేకపోతున్నానని.. దోమ తెర వాడేందుకు అనుమతి ఇవ్వాలని వేడుకున్నారు. అందుకు న్యాయమూర్తి అంగీకరించలేదు. కావాలంటే ఒడొమస్‌ వాడుకో అంటూ సూచించారు.

దావూద్ అనుచరుడి రక్తం తాగుతున్న దోమలు, చంపిన దోమలతో కోర్టుకు..
X

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఇప్పుడు దోమలకు భయపడుతున్నాడు.దోమల దెబ్బకు వణికిపోతున్న గ్యాంగ్‌స్టర్ ఎజాజ్ లక్డావాలా ఏకంగా తాను చంపిన దోమలను ప్లాస్టిక్‌ బాటిల్‌లో వేసుకుని ముంబాయి సెషన్స్ కోర్టు జడ్జి ముందు ప్రదర్శించారు.

2020లో ఎజాజ్ అరెస్ట్ అయ్యాడు. అప్పటి నుంచి ముంబాయి శివారులోని తలోజా జైలులో ఉంటున్నారు. తొలుత అతడికి దోమతెర వాడుకునే వెసులుబాటు ఇచ్చారు. మేనెలలో జైలు అధికారులు భద్రతా కారణాలను చూపుతూ దోమ తెరను అనుమతించలేదు. అప్పటి నుంచి గ్యాంగ్‌స్టర్‌తో దోమలు ఆడుకుంటున్నాయి. దాంతో ఎజాజ్‌ తాను సెల్‌లో చంపిన దోమలను ఒక ప్లాస్టిక్‌ బాటిల్‌లో వేసుకుని తనను కోర్టు ముందు హాజరుపరిచిన సమయంలో న్యాయమూర్తికి చూపించారు.

తాను ఈ దోమల దాడిని తట్టుకోలేకపోతున్నానని.. దోమ తెర వాడేందుకు అనుమతి ఇవ్వాలని వేడుకున్నారు. అందుకు న్యాయమూర్తి అంగీకరించలేదు. కావాలంటే ఒడొమస్‌ వాడుకో అంటూ సూచించారు.

ఇదే తలోజా జైలులో ఉంటున్న ఇతర ఖైదీల్లో పలువురు కూడా ఇలాగే దోమ తెరకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించారు. వారిలో కొందరికి కొందరు న్యాయమూర్తులు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత మరో న్యాయమూర్తి వాటిని నిరాకరించారు. దోమల బారి నుంచి కాపాడుకునేందుకు ఖైదీలు దోమతెరలు ఉపయోగించుకునే అవకాశం ఇవ్వాలంటూ ఒక సామాజిక కార్యకర్త కూడా న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. అది ఇంకా పెండింగ్‌లో ఉంది.

First Published:  5 Nov 2022 2:55 AM GMT
Next Story