Telugu Global
National

ర‌న్నింగ్‌ బస్సులో దళిత యువతిపై సామూహిక అత్యాచారం..

బస్సు లోపల ఉన్న ప్రయాణికులు గుర్తించకుండా క్యాబిన్ వద్ద ఉన్న తలుపును మూసి ఈ దారుణానికి పాల్పడ్డారు. అయితే బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో బస్సు లోపల ఉన్న ప్రయాణికులు బయటకు వచ్చారు.

ర‌న్నింగ్‌ బస్సులో దళిత యువతిపై సామూహిక అత్యాచారం..
X

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేరస్తులపై యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ నేరాలు, దారుణాలు మాత్రం ఆగడం లేదు. నేరాలకు పాల్పడుతున్న వారిని వరుసగా ఎన్ కౌంటర్ చేస్తున్నప్పటికీ నేరస్తుల్లో భయం రావడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘ‌టన జరిగింది. కదులుతున్న బస్సులో ప్రయాణికులు ఉండగానే దళిత యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన డిసెంబర్ 9వ తేదీ అర్ధరాత్రి జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది.

20 ఏళ్ల దళిత యువతి ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నుంచి జైపూర్‌కు వెళ్లేందుకు ఓ ప్రైవేట్ బస్సు ఎక్కింది. అయితే బాధితురాలు బస్సు లోపల కాకుండా క్యాబిన్‌లో కూర్చుంది. జైపూర్‌కు వెళ్లే ఈ ప్రైవేట్ బస్సులో ఆరిఫ్, లలిత్ అనే ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. ఈ ఇద్దరు డ్రైవర్లు క్యాబిన్‌లో కూర్చున్న దళిత యువతిపై ఒకరి తర్వాత మరొకరు సామూహిక అత్యాచారం చేశారు.

బస్సు లోపల ఉన్న ప్రయాణికులు గుర్తించకుండా క్యాబిన్ వద్ద ఉన్న తలుపును మూసి ఈ దారుణానికి పాల్పడ్డారు. అయితే బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో బస్సు లోపల ఉన్న ప్రయాణికులు బయటకు వచ్చారు. లలిత్ బస్సు దిగి పారిపోగా.. ఆరిఫ్‌ను ప్రయాణికులు పోలీసులకు అప్పగించారు. ఆరిఫ్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లు కనోటా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ భగవాన్ సహాయ్ మీనా తెలిపారు. పరారీలో ఉన్న లలిత్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

First Published:  16 Dec 2023 11:10 AM GMT
Next Story