Telugu Global
National

నెపోటిజం వల్లే అలియా-రణ్‌బీర్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు.. కంగనా ఫైర్

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల ఎంపిక‌లో నిర్వాహకులు పక్షపాతంతో వ్యవహరించారని కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా ఆమె దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.

నెపోటిజం వల్లే అలియా-రణ్‌బీర్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు.. కంగనా ఫైర్
X

బాలీవుడ్ లో మరోసారి నెపోటిజంపై చర్చ మొదలైంది. యంగ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడ్డ సమయంలో నెపోటిజం వల్లే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్రచారం జరిగింది. బ్యాగ్రౌండ్ ఉన్న నటీనటులకే బాలీవుడ్ ప్రాధాన్యం ఇస్తుందని అప్పట్లో స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ వంటి వారు విమర్శలు చేశారు. కాగా తాజాగా బాలీవుడ్ లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల అందజేత కార్యక్రమం జరిగింది. బ్రహ్మాస్త్రలో ఉత్తమ నటన చేసినందుకు రణ్ బీర్ కపూర్ బెస్ట్ యాక్టర్ గా ఎంపికయ్యాడు. అలాగే గంగుబాయి కథియవాడీలో అలియాభట్ నటనకు బెస్ట్ ఫిమేల్ యాక్టర్ అవార్డుకు ఎంపికైంది.

ఇలా ఒకేసారి భార్యాభర్తలు ఉత్తమ నటీనటులుగా దాదాసాహెబ్ పాల్కే అవార్డులు అందుకున్నారు. ఇక ఫిలిం ఆఫ్ ది ఇయర్ గా టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్ ఎంపిక కాగా, కాంతారా సినిమాలో చేసిన నటనకు గానూ రిషబ్ శెట్టికి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డు అందుకున్నారు.


అయితే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల ఎంపిక‌లో నిర్వాహకులు పక్షపాతంతో వ్యవహరించారని కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా ఆమె దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. బాలీవుడ్ ను ఇంకా నెపోటిజం వదల్లేదని, అవార్డులు కూడా బ్యాగ్రౌండ్ ఉన్న వారికే ఇస్తున్నారని విమర్శించారు.

నెపో మాఫియా కారణంగా అర్హులకు అవార్డులు అందడం లేదని మండిపడ్డారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అందుకోవాల్సిన అర్హత వీరికే ఉందంటూ.. ఒక జాబితాను కంగనా ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. కంగనా చేసిన ఈ కామెంట్స్ తో బాలీవుడ్ లో ఉన్న నెపోటిజంపై మరోసారి చర్చలు జరుగుతున్నాయి.

నిజానికి బ్రహ్మాస్త్ర సినిమాలో రణ్ బీర్ కపూర్ అంత గొప్పగా ఏమీ నటించలేదు. టాలీవుడ్ లో నిర్మితమైన ఆర్ఆర్ఆర్ మూవీలో హీరోలుగా నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉత్తమ నటుల కేటగిరీలో ఆస్కార్ నామినేషన్స్ లో పోటీపడ్డారు. కనీసం వారిద్దరిలో ఒకరిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక చేయకుండా రణ్ బీర్ కపూర్ కు అవార్డు అందజేయడంపై విమర్శలు వస్తున్నాయి.

First Published:  21 Feb 2023 12:30 PM GMT
Next Story