Telugu Global
National

వారి చేతులు, త‌ల‌లు నర‌కండి.. తుపాకులు తెచ్చుకోండి: విహెచ్ పి ఢిల్లీ ర్యాలీలో విద్వేష ప్ర‌సంగాలు

ఢిల్లీలో జరిగిన ఓ హిందుత్వ కార్యక్రమంలో వక్తలు విద్వేషపూరిత ప్రసంగాలు చేశారు. పరోక్షంగా ముస్లింలను ఉద్దేశించి వాళ్ళ చేతులు, తల నరకండి అంటు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

వారి చేతులు, త‌ల‌లు నర‌కండి.. తుపాకులు తెచ్చుకోండి: విహెచ్ పి ఢిల్లీ ర్యాలీలో విద్వేష ప్ర‌సంగాలు
X

ఢిల్లీలో విశ్వహిందూ పరిషత్ నిర్వ‌హించిన ర్యాలీలో వ‌క్త‌లు విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారు. ఢిల్లీలో 25 ఏళ్ల యువకుడి హత్య నేపథ్యంలో 'వారి చేతులు, తల నరికేయండి' అంటూ వ్యాఖ్యలు చేశారు. 25 ఏళ్ల ఓ యువకుడిని ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తులు హత్య చేశారంటూ ఆరోప‌ణ‌లు చేశారు. ఈ హ‌త్య‌కు నిర‌స‌న‌గా విహెచ్ పి నాయ‌కులు స‌భ నిర్వ‌హించారు . కొంద‌రు వ‌క్త‌లు ద్వేషపూరిత ప్రసంగాలు చేశారు. ఈ తాజా సంఘటన కలకలం రేపింది.

దాడికి పాల్పడిన వారిపై తుపాకులు ప్రయోగించాలని వీహెచ్‌పీ నేతలు పిలుపునిచ్చారు. వక్తలలో ఒకరైన జగద్గురు యోగేశ్వర్ ఆచార్య మాట్లాడుతూ.." మరణించిన యువకుడిపై దాడి చేసిన వారి తల, చేతులు నరికివేయాలని పిలుపునివ్వడంతో ర్యాలీ ద్వేషపూరిత ప్రసంగాల వేదికగా మారింది. అవసరమైతే వారి చేతులు, త‌ల‌లు నరికేయండి. మ‌హా అయితే మీరు జైలుకు వెళతారు అంతే క‌దా. అయితే ఇటువంటి శ‌క్తుల‌కు గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. వ్యక్తులను ఎంపిక చేసి చంపండి." అని ఆచార్య అన్నారు.

మరొక వ‌క్త మహంత్ నావల్ కిషోర్ దాస్ మాట్లాడుతూ.. " లైసెన్సు ఉన్నా లేక‌పోయినా ప‌ర్వాలేదు మీరంతా తుపాకులు ద‌గ్గ‌ర ఉంచుకోవాల‌ని పిలుపునిచ్చారు. అతను రెచ్చగొట్టే పదజాలంతో, "మీరు లైసెన్స్ పొందలేకపోయినా చింతించకండి. మిమ్మల్ని చంపడానికి వచ్చే వాళ్ళకి లైసెన్స్ ఉందా?అలాంటప్పుడు మీకు మాత్రం లైసెన్స్ ఎందుకు ? అందరం కలిస్తే ఢిల్లీ పోలీస్ కమీషనర్ కూడా మనకు టీ ఇస్తారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ మ‌న‌కు ఏం కావాలంటే అది చేసుకోవ‌చ్చ‌ని చెబుతారు" అని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు కూడా చేశాడు.

కాగా వీహెచ్ పీ ర్యాలీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

First Published:  10 Oct 2022 2:43 PM GMT
Next Story