Telugu Global
National

జనవరి-1 నుంచి భారత్ లో కొవిడ్ కొత్త రూల్స్..

ఇప్పటి వరకూ విదేశాలనుంచి వచ్చేవారికి మన విమానాశ్రయాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. ఇప్పుడు అక్కడినుంచే వారు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ రిపోర్ట్ ఉంటేనే ఇండియాలోకి అనుమతిస్తారు.

జనవరి-1 నుంచి భారత్ లో కొవిడ్ కొత్త రూల్స్..
X

కొత్త వేరియంట్ తో ప్రమాదమేమీ లేదని నిపుణులు చెబుతున్నా.. మరోవైపు కేంద్రం మాత్రం ముందు జాగ్రత్తగా కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తోంది. జనవరి-1నుంచి భారత్ లో కొవిడ్ కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. ముఖ్యంగా విదేశాలనుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కేంద్రం అప్రమత్తత ప్రకటించింది. ఇప్పటి వరకూ విదేశాలనుంచి వచ్చేవారికి మన విమానాశ్రయాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. అనుమానం ఉన్నవారిని క్వారంటైన్ లో ఉంచుతున్నారు. ఇప్పుడు అక్కడినుంచే వారు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ రిపోర్ట్ ఉంటేనే ఇండియాలోకి అనుమతిస్తారు.

చైనాతోపాటు హాంకాంగ్, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్, థాయిలాండ్ దేశాలనుంచి భారత్ కి వచ్చేవారు ఇకపై ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ తెచ్చుకోవాలి. దానికి కూడా మూడు రోజులే వేలిడిటీ ఉంటుంది. అంతకు ముందు తీసుకున్న సర్టిఫికెట్లు చెల్లుబాటు కావు. అంటే భారత్ కు ప్రయాణం పెట్టుకుంటే, 72 గంటల ముందు కొవిడ్ ఆర్టీపీసీఆర్ పరీక్షల చేయించుకోవాల్సి ఉంటుంది. అది నెగెటివ్ అని తేలితేనే ప్రయాణం, లేకపోతే లేదు. విదేశీ ప్రయాణికులకు కొత్త సంవత్సరం నుంచి ఈ నిబంధను అమలులోకి వస్తాయని తెలిపారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌ సుఖ్‌ మాండవీయ.

ఒకవేళ ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకుని ప్రయాణం పూర్తి చేసి భారత్ లో ల్యాండ్ అయినా.. ఎయిర్ పోర్టుల్లో ర్యాండమ్ గా 2 శాతం మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. అక్కడ ఫలితం తేడా వచ్చినా క్వారంటైన్ కి పరిమితం కావాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం భారత్ లో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉందని కేంద్రం తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు కేవలం 0.11శాతంగా ఉంది. అయినా కూడా అప్రమత్తత అవసరం అని తేల్చి చెప్పింది. రాబోయే 40 రోజులు కీలకమని ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  29 Dec 2022 2:16 PM GMT
Next Story