Telugu Global
National

కోవిడ్-19: ఈ దేశాల నుండి వచ్చే ప్రయాణీకులకు RT-PCR పరీక్ష త‌ప్ప‌నిసరి

Covid Travel Advisory: ప్రయాణీకులందరూ మాస్క్‌లు ధరించాలని, విమానాశ్రయాలలో రద్దీని నివారించాలని, దిగేప్పుడు భౌతిక దూరం పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు. అంతర్జాతీయ విమానాలలో వచ్చే ప్రయాణీకులందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేసి, రోగలక్షణ వ్యక్తులు ఉంటే వారిని వెంటనే వైద్య సదుపాయంతో ఐసోలేష‌న్ కు పంపుతామ‌ని మాండ‌వీయ తెలిపారు.

Covid Travel Advisory
X

కోవిడ్-19: ఈ దేశాల నుండి వచ్చే ప్రయాణీకులకు RT-PCR పరీక్ష త‌ప్ప‌నిసరి

చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయ్‌లాండ్ నుండి వచ్చే ప్రయాణీకులకు RT-PCR పరీక్షలను తప్పనిసరి అని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. శనివారం ఆయ‌న రెండు శాతం అంతర్జాతీయ రాకపోకలకు సంబంధించి రాండ‌మ్ కోవిడ్ -19 పరీక్షను ప్రారంభించారు.

ఈ దేశాల నుండి వచ్చే ప్రయాణీకులు తమ ఆరోగ్య స్థితిని ప్రకటించడానికి 'ఎయిర్ సువిధ' ఫారమ్‌ను పూరించడం కూడా తప్పనిసరి చేస్తామ‌న్నారు. ఎయిర్ సువిధ ఫారమ్ లో ప్రయాణికుల పూర్తి టీకా వేయించుకున్న‌, లేదా ఆర్టీ-పిసిఆర్ ప‌రీక్ష వివ‌రాలు పూర్తి చేయాల్సి ఉంటుంద‌న్నారు.ప్ర‌యాణ స‌మ‌యానికి 72 గంట‌ల ముందు ఈ ప‌రిక్ష చేయించుకున్నారా లేదా అనే వివ‌రాలు ఉంటాయ‌ని పేర్కొన్నారు.

ప్రయాణీకులందరూ మాస్క్‌లు ధరించాలని, విమానాశ్రయాలలో రద్దీని నివారించాలని, దిగేప్పుడు భౌతిక దూరం పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు. అంతర్జాతీయ విమానాలలో వచ్చే ప్రయాణీకులందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేసి, రోగలక్షణ వ్యక్తులు ఉంటే వారిని వెంటనే వైద్య సదుపాయంతో ఐసోలేష‌న్ కు పంపుతామ‌ని మాండ‌వీయ తెలిపారు.

ప్రయాణాల‌పై ఎటువంటి ఆంక్ష‌లు విధించ‌బోమ‌ని చెబుతున్న‌ప్పటికీ, నమూనాల జన్యు పరీక్షను వేగవంతం చేయాలని, నిఘాను పెంచాలని కేంద్రం రాష్ట్రాలను అభ్యర్థించింది. విదేశాలలో కోవిడ్-19 కేసుల్లో తాజా పెరుగుదల BF 7 సబ్-వేరియంట్‌కు కారణమని చెబుతున్నారు. "ప్రస్తుత పరిస్థితులలో, అంతర్జాతీయ విమానాలను నియంత్రించాల్సిన అవసరం కానీ, లేదా లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం కానీ లేదు" అని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా శుక్రవారం అన్నారు.

మెడికల్ ఆక్సిజన్‌ను సక్రమంగా సరఫరా చేయాలని శ‌నివారంనాడు తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.

First Published:  24 Dec 2022 1:22 PM GMT
Next Story