Telugu Global
National

మళ్లీ కరోనా.. లాక్ డౌన్ వస్తుందా? జాగ్రత్తలు ఇలా..

చైనాతో పాటు పలు దేశాల్లో మళ్లీ కరోనా కేసులు వస్తుండడంతో మనదేశంలో కూడా మళ్లీ కరోనా భయం మొదలైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. బుధవారం కీలక సమీక్ష కూడా నిర్వహించింది. ఇంతకీ కరోనా మళ్లీ విజృంభిస్తుందా? లాక్‌డౌన్ వస్తుందా?

మళ్లీ కరోనా.. లాక్ డౌన్ వస్తుందా? జాగ్రత్తలు ఇలా..
X

కొన్ని దేశాల్లో బయటపడుతున్న కొత్త కొవిడ్‌ వేరియంట్లపై ప్రభుత్వ అధికారులు సమీక్షిస్తున్నారు. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించనున్నారు. కొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మార్గదర్శకాలు రూపొందించే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు అదుపులోనే ఉన్నాయి.

యాక్టివ్ కేసులు 4వేల కంటే తక్కువగానే ఉన్నాయి. కానీ.. చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, బ్రెజిల్‌, అమెరికా దేశాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. చైనాలో మళ్లీ విజృంభిస్తున్న బీఎఫ్‌.7 అనే కరోనాకి చెందిన ఒమిక్రాన్‌ వేరియంట్ భారత్‌లోనూ వెలుగు చూసింది.

దేశంలో ఈ రకానికి చెందిన కేసులు నాలుగు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. అలాగే గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 185 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ పరిణామాలను బట్టి చూస్తే మనం కూడా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది.

వ్యాపిస్తున్న కొత్త కరోనా వేరియంట్ల బారిన పడకూడదంటే గుంపులుగా ఉన్న చోట మాస్కులు ధరించాలి. ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు తీసుకోవాలి. జలుబు, దగ్గు, జ్వరాలాను నిర్లక్ష్యం చేయకూడదు. అయితే కరోనాలో కొత్త వేరియంట్లు బయటపడినప్పటికీ భారత్‌లో మళ్లీ లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితి రాదంటున్నారు ఆరోగ్య అధికారులు. కానీ, కరోనా కనీస జాగ్రత్తలు మాత్రం తప్పక పాటించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు.

First Published:  22 Dec 2022 12:29 PM GMT
Next Story