Telugu Global
National

5 దేశాల్లో పెరిగిన కరోనా కేసులు...అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్ర‍ం హెచ్చరిక‌

కొత్త వేరియంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇన్సాకాగ్ నెట్ వర్క్ ద్వారా కొత్త కేసులను ట్రాక్ చేయాలని, పాజిటీవ్ కేసుల నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

5 దేశాల్లో పెరిగిన కరోనా కేసులు...అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్ర‍ం హెచ్చరిక‌
X

చైనా, జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్ తదితర దేశాల్లో కరోనా కేసులు ఊహించని విధంగా పెరుగుతుండటంతో భారత ప్రభుత్వ అప్రమత్తమైంది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు లేఖలు రాసింది.

కొత్త వేరియంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇన్సాకాగ్ నెట్ వర్క్ ద్వారా కొత్త కేసులను ట్రాక్ చేయాలని, పాజిటీవ్ కేసుల నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

కాగా చైనా విధించిన కరోనా ఆంక్షల పట్ల అక్కడి ప్రజల్లో తీవ్ర నిరసనలు చెలరేగడంతో అక్కడి ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేసింది. దాంతో అక్కడ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వచ్చే మూడు నెలల్లో చైనాలోని 60 శాతం మంది ప్రజలకు కరోనా పాజిటీవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరో వైపు అమెరికా జపాన్, కొరియా, బ్రెజిల్ లలో కూడా రోజూవారీ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ 35 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. భారత్ లో కూడా ఈ రోజు 112 కొత్త కేసులు వచ్చినట్టు అధికారులు తెలిపారు.

First Published:  20 Dec 2022 3:37 PM GMT
Next Story