Telugu Global
National

హిమాచల్ లో కాంగ్రెస్, గుజరాత్ లో బీజేపీ విజయం!

గుజరాత్ ను బీజేపీ , హిమాచల్ ప్రదేశ్ ను కాంగ్రెస్ కైవసం చేసుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ 40 సీట్లు గెల్చుకోగా, గుజరాత్ లో బీజేపీ 156 సీట్లు గెల్చుకుంది.

హిమాచల్ లో కాంగ్రెస్, గుజరాత్ లో బీజేపీ విజయం!
X


హిమాచల్ ప్రదేశ్ , గుజరాత్ ఎన్నికల్లో విజేతలెవరో తేలిపోయింది. హిమాచల్ లో కాంగ్రెస్, గుజరాత్ లో బీజేపీ విజయం సాధించాయి.

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ 40 సీట్లు గెల్చుకుంది. గుజరాత్ లో బీజేపీ 156 సీట్లు గెల్చుకుంది.

హిమాచల్ మొత్తం అసెంబ్లీ స్థానాలు 68 కాగా 35 స్థానాలు గెలిచిన వాళ్ళు ప్రభుత్వ పగ్గాలు చేపడతారు. కాంగ్రెస్ 40 సీట్లు గెల్చుకొని మెజార్టీ సాధించింది. . ఇక్కడ బీజేపీ 25 స్థానాలు గెలిచింది మరో ముగ్గురు ఇండిపెండెంట్లు గెలిచారు. ఆప్ ఇక్కడ ఖాతా తెరవలేదు.

ఇక గుజరాత్ లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 182 కాగా 92 స్థానాలు గెల్చిన వాళ్ళకు విజయం దక్కుతుంది బీజేపీ 156 స్థానాలు గెల్చుకుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 17 సీట్లకే పరిమితమయ్యింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ 5 స్థానాల్లో విజయం సాధించింది. ఇతరులు 4 స్థానాల్లో గెలిచారు.

కాగా గుజరాత్ లో తమ ఓటమికి ఆమ్ ఆద్మీ పార్టీ, అసదుద్దీన్ ఓవైసీలే కారణమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగదీశ్ ఠాకూర్ ఆరోపించారు. కేజ్రీవాల్, అసదుద్దీన్ లు గుజరాత్ కు వచ్చిందే కాంగ్రెస్ ఓట్లను చీల్చి బీజేపీని గెలిపించేందుకే అని ఆయన మండిపడ్డారు.

మరో వైపు గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ డిసెంబర్ 12న మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ గురువారం చెప్పారు.

డిసెంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు గుజరాత్ సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు" అని సిఆర్ పాటిల్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి ఏర్పాటు చేసిన‌ విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

ఇక హిమాచల్ ప్రదేశ్ లో మెజార్టీ సాధించినప్పటికీ కాంగ్రెస్ 'ఆపరేషన్ లోటస్' కు భయపడుతోంది. గెలిచిన కాంగ్రెస్, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలపై ఇప్పటికే బీజేపీ వల విసిరిందని సమాచారం రావడంతో కాంగ్రెస్ నాయకులు ఆందోళనలో ఉన్నారు. తమ ఎమ్మెల్యేలను రాజస్థాన్ తీసుకెళ్ళాలని ముందుగా అనుకున్నప్పటికీ మళ్ళీ ప్లాన్ మార్చుకొని చండీగడ్ తీసుకెళ్ళాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

First Published:  8 Dec 2022 10:23 AM GMT
Next Story