Telugu Global
National

ఆవు పంచకంతో అసెంబ్లీ శుద్ధి.. ఆ తర్వాతే ప్రమాణ స్వీకారాలు

ప్రమాణ స్వీకారోత్సవం కోసం ప్రొటెం స్పీకర్ గా కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్వీ దేశ్ పాండే ని ఎన్నుకున్నారు. ఆయనతో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు.

ఆవు పంచకంతో అసెంబ్లీ శుద్ధి.. ఆ తర్వాతే ప్రమాణ స్వీకారాలు
X

కర్నాటక అసెంబ్లీలో నేడు ప్రమాణ స్వీకారల ఘట్టం అట్టహాసంగా జరిగింది. అయితే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవానికి ముందుగా కాంగ్రెస్ నేతలు కర్నాటక అసెంబ్లీని శుద్ధి చేశారు. విధాన సౌధ పరిసర ప్రాంతాల్లో ఆవు పంచకం చల్లారు. వేద పండితుల్ని వెంట తీసుకుని వెళ్లి మరీ మూల మూలలా ఆవు మూత్రాన్ని చల్లించారు. మంత్రోచ్ఛారణలతో ఈ ఘట్టం ముగించారు. అసెంబ్లీని శుద్ధి చేయడానికే ఈ పని చేశామంటున్నారు కాంగ్రెస్ నేతలు. బీజేజీ స్టైల్ లోనే వారికి కౌంటర్ ఇచ్చారు.


కర్నాటక అసెంబ్లీలో ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవాల సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్.. బీజేపీ నేతల్ని కలిసి వారితో ఫొటోలు దిగారు. మాజీ సీఎం బసవరాజ్ బొమ్మైని ఆప్యాయంగా పలకరించారు.


ప్రమాణ స్వీకారోత్సవం కోసం ప్రొటెం స్పీకర్ గా కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్వీ దేశ్ పాండే ని ఎన్నుకున్నారు. ఆయనతో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ఇదివరకే బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. వారితోపాటు మరో ఎనిమిది మంది కేబినెట్ మినిస్టర్లుగా అదే రోజు ప్రమాణం చేశారు.

First Published:  22 May 2023 9:26 AM GMT
Next Story