Telugu Global
National

ఇళ్లు లేని వాళ్లు జెండా ఎక్కడ ఎగురవేయాలి మోదీజీ .. చిదంబరం ఫైర్..!

ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లపై జాతీయ జెండా ఎగుర వేయాలని మోదీ కోరుతున్నారని, మరి ఇళ్లు లేని వాళ్లు జెండా ఎక్కడ ఎగురవేయాలని ఆయన ప్రశ్నించారు

ఇళ్లు లేని వాళ్లు జెండా ఎక్కడ ఎగురవేయాలి మోదీజీ .. చిదంబరం ఫైర్..!
X

దేశవ్యాప్తంగా కొద్ది రోజులుగా స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుండటాన్ని పురస్కరించుకొని కేంద్రం ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట సంబరాలు నిర్వహిస్తోంది. ఎన్డీయే, దాని మిత్ర పక్షాలు జాతీయ జెండాలు చేతబూని ఊరు వాడ ర్యాలీలు జరుపుతున్నారు. ఇక ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని అందరూ తమ ఫోన్ డీపీగా త్రివర్ణ పతాకం పెట్టుకోవాలని, తమ తమ ఇళ్లపై జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

అలాగే ఇళ్లపై జెండా ఎగురవేసి ఫొటోలు తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలని కోరారు. అయితే దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ప్రభుత్వం చెప్పింది పాటిస్తుండగా.. మరి కొందరు జెండా ఎగురవేయడం, సెల్ లో డీపీగా పెట్టుకుంటేనే దేశంపై ప్రేమ ఉన్నట్లా.. అని ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. మోదీ ఇచ్చిన పిలుపుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం. ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లపై జాతీయ జెండా ఎగుర వేయాలని మోదీ కోరుతున్నారని, మరి ఇళ్లు లేని వాళ్లు జెండా ఎక్కడ ఎగురవేయాలని ఆయన ప్రశ్నించారు. తాజాగా ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

'దేశంలో ఇళ్లు లేని నిరు పేదలు ఎంతో మంది ఉన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య దేశంలో రోజు రోజుకూ పెరుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. పేదల అభివృద్ధి గురించి పట్టించుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు రాయితీలు అందజేస్తోంది. దేశంలో కాంగ్రెస్ హయాంలో నెలకొల్పిన ప్రభుత్వరంగ సంస్థలను మోదీ ప్రభుత్వం ప్రయివేట్ సంస్థలకు అప్పగించడమే పనిగా పెట్టుకుంది.' అని చిదంబరం విమర్శలు చేశారు.

First Published:  15 Aug 2022 3:10 AM GMT
Next Story