Telugu Global
National

బొటాబొటి సీట్లు కాదు.. క్లియర్ విక్టరీ దిశగా కాంగ్రెస్

ఫలితాల తర్వాత సీఎం సీటు విషయంలో కాంగ్రెస్ వేచి చూసేందుకు ఇష్టపడటంలేదు. రేపే కాంగ్రెస్ లేజిస్లేటివ్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నారు.

బొటాబొటి సీట్లు కాదు.. క్లియర్ విక్టరీ దిశగా కాంగ్రెస్
X

224 స్థానాల కర్నాటక అసెంబ్లీలో 113 సీట్లు వచ్చిన పార్టీ అధికారం చేజిక్కించుకుంటుంది. ఇప్పటి వరకూ 113 స్థానాల మేజిక్ ఫిగర్ విషయంలో చాలా అనుమానాలున్నాయి. ప్రీ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ దే విజయం అన్నాకూడా.. మెజార్టీ విషయంలో మాత్రం అందరిలో అనుమానాలున్నాయి. వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ కాంగ్రెస్ క్లియర్ విక్టరీ దిశగా అడుగులు వేస్తోంది. మధ్యాహ్నానికి గెలిచిన, గెలవబోయే సీట్ల విషయంలో క్లారిటీ వచ్చేసింది. కాంగ్రెస్ కి 120కంటే ఎక్కువ సీట్లు వస్తాయని తేలిపోయింది. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో కాంగ్రెస్ ఎవరిపై ఆధారపడాల్సిన పని లేదు, ఎమ్మెల్యేలు చేజారతారనే భయం కూడా కాంగ్రెస్ కి లేదు,


కాంగ్రెస్ ముందు జాగ్రత్త..

మెజార్టీ విషయంలో క్లారిటీ వచ్చేసినా.. కాంగ్రెస్ మాత్రం తన జాగ్రత్తల్లో తాను ఉంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా చేజారకుండా ఉండాలని చూస్తోంది. ఈరోజు రాత్రికి ఎమ్మెల్యేలందర్నీ బెంగళూరుకి రావాలని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, వారందర్నీ తమిళనాడుకి తరలించే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ సహాయం కోరింది కాంగ్రెస్ అధిష్టానం.

సీఎం ఎవరో తేలేది రేపే..

ఫలితాల తర్వాత సీఎం సీటు విషయంలో కాంగ్రెస్ వేచి చూసేందుకు ఇష్టపడటంలేదు. రేపే కాంగ్రెస్ లేజిస్లేటివ్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నారు. ఈ మీటింగ్ లో సీఎంని నిర్ణయిస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ లో చీలిక తెచ్చేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా బీజేపీ వదిలిపెట్టదు కాబట్టి కాంగ్రెస్ ముందు జాగ్రత్తల్లో ఉంది.

First Published:  13 May 2023 8:27 AM GMT
Next Story