Telugu Global
National

ఏపీ, తెలంగాణకు కొత్త ఇన్‌ఛార్జ్‌లు.. కాంగ్రెస్‌ కీలకమార్పులు

ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఎంపీ మాణిక్కం ఠాగూర్‌కు బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్‌ పార్టీ. గతంలో మాణిక్కం ఠాగూర్ తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు.

ఏపీ, తెలంగాణకు కొత్త ఇన్‌ఛార్జ్‌లు.. కాంగ్రెస్‌ కీలకమార్పులు
X

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక మార్పులు చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌లను మార్చింది. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా దీపా దాస్‌మున్షికి అదనపు బాధ్యతలు అప్పగించింది. కేరళ, లక్షద్వీప్‌లో దీపా దాస్‌మున్షికి పార్టీ ఇన్‌ఛార్జ్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు కట్టబెట్టింది. ఇక పశ్చిమ బెంగాల్‌కు చెందిన దీపా దాస్‌మున్షి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో పరిశీలకురాలిగా పనిచేశారు.

ఇక ఇప్పటివరకూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా పని చేసిన మాణిక్‌ రావు ఠాక్రేకు గోవా, డామన్‌ డయ్యూ, దాద్రానగర్‌ హవేలి ఇన్‌ఛార్జ్‌గా నియమిచింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు పార్టీ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన ఠాక్రే.. నేతల మధ్య విబేధాలను పరిష్కరించి పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

ఇక ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఎంపీ మాణిక్కం ఠాగూర్‌కు బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్‌ పార్టీ. గతంలో మాణిక్కం ఠాగూర్ తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. కర్ణాటక ఇన్‌ఛార్జ్‌గా రణ్‌దీప్ సుర్జేవాలా, గుజరాత్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా ముకుల్ వాస్నిక్, మహారాష్ట్ర బాధ్యుడిగా రమేష్ చెన్నింతలను నియమించింది.

First Published:  23 Dec 2023 3:50 PM GMT
Next Story