Telugu Global
National

సివిల్స్‌ మెయిన్స్‌ ఫలితాలు విడుదల

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్షలను మే నెలలో నిర్వహించగా, జూన్‌లోనే ఫలితాలు విడుదల చేసింది. ఆ తర్వాత మెయిన్స్‌ పరీక్షలు సెప్టెంబర్‌ 15, 16, 17, 23, 24 తేదీల్లో రోజుకు రెండు సెషన్లు చొప్పున నిర్వహించింది.

సివిల్స్‌ మెయిన్స్‌ ఫలితాలు విడుదల
X

సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్ (సీఎస్‌ఈ)– 2023 మెయిన్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగుల ఎంపిక కోసం నిర్వహించే ఈ పరీక్షలో దేశం మొత్తం మీద 1105 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పరీక్షల ఫలితాలను యూపీఎస్సీ (Union Public Service Commission) శుక్రవారం విడుదల చేసింది.

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్షలను మే నెలలో నిర్వహించగా, జూన్‌లోనే ఫలితాలు విడుదల చేసింది. ఆ తర్వాత మెయిన్స్‌ పరీక్షలు సెప్టెంబర్‌ 15, 16, 17, 23, 24 తేదీల్లో రోజుకు రెండు సెషన్లు చొప్పున నిర్వహించింది. ప్రస్తుతం మెయిన్స్‌ పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది దశ ఎంపిక ప్రక్రియ పూర్తిచేయనున్నారు. తద్వారా ఎంపికైనవారు అఖిల భారత సర్వీసుల్లో విధులు నిర్వహిస్తారు.

గత మే నెలలో నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్షలకు దాదాపు 13 లక్షల మంది హాజ‌ర‌య్యారు. వారిలో మెయిన్స్‌కి 15 వేల మంది ఎంపికయ్యారు. తాజాగా విడుదలైన మెయిన్స్‌ ఫలితాల్లో దాదాపు 2500 మంది ఇంటర్వ్యూకు ఎంపికైనట్టు సమాచారం. ఇక ఇంటర్వ్యూలు ఎప్పుడు నిర్వహిస్తారనే తేదీలతో నోటిఫికేషన్‌ విడుదల కావాల్సి ఉంది.

First Published:  9 Dec 2023 5:43 AM GMT
Next Story