Telugu Global
National

ఛత్తీస్‌గ‌ఢ్ సీఎం సహా ఉన్నతాధికారుల ఆస్తులు అటాచ్.. - బొగ్గు కుంభకోణం కేసులో ఈడీ చర్యలు

ఈ వ్యవహారంపై ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ గతంలోనే ఐఏఎస్ అధికారి సమీర్ వైష్ణోయ్ తో పాటు ఈ కుంభకోణంలో కీలక పాత్రధారిగా అనుమానిస్తున్న సూర్యకాంత తివారీ ఇళ్లలో సోదాలు నిర్వహించింది

ఛత్తీస్‌గ‌ఢ్ సీఎం సహా ఉన్నతాధికారుల ఆస్తులు అటాచ్.. - బొగ్గు కుంభకోణం కేసులో ఈడీ చర్యలు
X

ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి తో పాటు ఉన్నతాధికారుల ఆస్తులు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. బొగ్గు అక్రమ మైనింగ్ కుంభకోణం కేసులో ఈ చర్య తీసుకుంది. ఈ కేసులో ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్ బగేల్ తో పాటు ఉన్నతాధికారులను బినామీలుగా ఈడీ అనుమానిస్తోంది. సీఎంతో పాటు డిప్యూటీ సెక్రటరీ సౌమ్య చౌరాసియా, ఐఏఎస్ అధికారి సమీర్ వైష్ణోయ్ తో పాటు మరో బొగ్గు వ్యాపారవేత్తకు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వీరికి చెందిన మొత్తం 152 కోట్ల ఆస్తులు అటాచ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఆదాయపు పన్ను శాఖ ఫిర్యాదు మేరకు వీరిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది.

గడచిన రెండు సంవత్సరాల కాలంలో 450 కోట్ల రూపాయల మేరకు బొగ్గు లెవీ రూపంలో కుంభకోణం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఈ వ్యవహారంపై ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ గతంలోనే ఐఏఎస్ అధికారి సమీర్ వైష్ణోయ్ తో పాటు ఈ కుంభకోణంలో కీలక పాత్రధారిగా అనుమానిస్తున్న సూర్యకాంత తివారీ ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఈ కేసులో శనివారం అటాచ్ చేసిన ఆస్తుల విలువ రూ.152.31 కోట్లు ఉంటుందని ఈడీ వెల్లడించింది. వాటిలో సూర్యకాంత్ తివారికి చెందిన 65 ఆస్తులు, సౌమ్య చౌరాసియా కు చెందిన 21 ఆస్తులు, సమీర్ వైష్ణోయ్ కి చెందిన ఐదు ఆస్తులను స్తంభింపచేసినట్టు ఈడీ తెలిపింది. ఈ కేసులో మరింత విచారణ కొనసాగించనున్నట్టు ఈడీ వెల్లడించింది.

First Published:  11 Dec 2022 5:54 AM GMT
Next Story