Telugu Global
National

టీఆరెస్ పేరును బీఆరెస్ గా మార్చండి... పార్లమెంటులో చైర్మెన్, స్పీకర్లకు ఎంపీల విజ్ఞప్తి

ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం టీఆరెస్ పేరును బీఆరెస్ గా మార్చింది. ఇక పార్లమెంటు ఉభయసభల్లో కూడా తమ పార్టీ పేరును బీఆరెస్ గా గుర్తించాలంటూ బీఆరెస్ ఎంపీలు రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్ఖడ్, లోకసభ స్పీకర్ ఓం బిర్లాల‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

టీఆరెస్ పేరును బీఆరెస్ గా మార్చండి... పార్లమెంటులో చైర్మెన్, స్పీకర్లకు ఎంపీల విజ్ఞప్తి
X

తెలంగాణ రాష్ట్ర స‌మితి, భార‌త రాష్ట్ర స‌మితిగా పేరు మార్చుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తోంది. అనేక రాష్ట్రాలనుంచి, రాజకీయ నాయకులు, మేదావులు, విద్యార్థులు, మహిళలు, ముఖ్యంగా రైతులు బీఆరెస్ లో చేరడానికి తహ తహలాడుతున్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు తమ రాష్ట్రాల్లో కూడా అమలుకావాలంటే బీఆరెస్ కావాల్సిందే అనే భావంతో ప్రజలు బీఆరెస్ వైపు చూస్తున్నారు.

కాగా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం టీఆరెస్ పేరును బీఆరెస్ గా మార్చింది. ఇక పార్లమెంటు ఉభయసభల్లో కూడా తమ పార్టీ పేరును బీఆరెస్ గా గుర్తించాలంటూ బీఆరెస్ ఎంపీలు రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్ఖడ్, లోకసభ స్పీకర్ ఓం బిర్లాల‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లోక్‌స‌భ ఫ్లోర్‌లీడ‌ర్‌ నామా నాగేశ్వ‌ర‌రావు, రాజ్య‌స‌భ ఫ్లోర్ లీడ‌ర్ కే కేశ‌వ‌రావుతో పాటు ఇత‌ర ఎంపీలు, బీఆరెస్ అధ్యక్షులు కేసీఆర్ రాసిన లేఖను జగదీప్ దన్ఖడ్,ఓం బిర్లా లకు అందజేశారు.

ఎంపీల వినతిపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్ఖడ్, లోకసభ స్పీకర్ ఓం బిర్లా లు సానుకూలంగా స్పందించారు. పార్టీ పేరును ఇకపై బీఆరెస్ గా మార్చాలని రాజ్యసభ ఛైర్మన్ జ‌గ‌దీప్ ద‌న్ఖడ్ అధికారులను ఆదేశించగా, పరిశీలించి నిర్ణయం తీసుకుంటాన‌ని లోకసభ స్పీకర్ ఓం బిర్లా ఎంపీలకు తెలిపారు.First Published:  23 Dec 2022 9:31 AM GMT
Next Story