Telugu Global
National

చంద్రుడికి మరింత దగ్గరగా చంద్రయాన్-3.. మరో వారం రోజుల్లో దిగనున్న స్పేస్‌క్రాఫ్ట్

చంద్రయాన్-3 కక్ష్య తగ్గింపు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు బెంగళూరులోని 'ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్' (ISTRAC) ప్రకటించింది.

చంద్రుడికి మరింత దగ్గరగా చంద్రయాన్-3.. మరో వారం రోజుల్లో దిగనున్న స్పేస్‌క్రాఫ్ట్
X

జాబిల్లి వైపుగా ఇస్రో ప్రయోగించిన చంద్రాయాన్-3 దుసుకెళ్తోంది. ఏపీలోని శ్రీహరికోట ప్రయోగ కేంద్రం నుంచి గత నెల నింగిలోకి వెళ్లిన చంద్రయాన్-3 క్రమంగా చంద్రుడి వైపుకు వెళ్తోంది. స్లింగ్ షాట్ పద్దతిలో దీన్ని ప్రయోగించడంతో కొన్నాళ్లు భూమి చుట్టూ ప్రదిక్షణలు చేసి.. గత వారమే చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ప్రస్తుతం చంద్రుడి చుట్టు ప్రదిక్షణలు చేస్తున్న చంద్రయాన్-3 వ్యోమనౌక జాబిల్లికి మరింత చేరువైంది.

చంద్రయాన్-3 కక్ష్య తగ్గింపు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు బెంగళూరులోని 'ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్' (ISTRAC) ప్రకటించింది. చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టే విషయంలో చంద్రయాన్-3కి ఇది రెండో చివరి కక్ష్యగా ఇస్రో పేర్కొన్నది. ఇవ్వాళ చేసిన విన్యాసంతో వ్యౌమనౌక కక్ష్యను (150X170) కిలోమీటర్లకు తగ్గించినట్లు ఇస్రో తెలిపింది.

ఇక తదుపరి కక్ష్యను ఈ నెల 16న ఉదయం 8.30కు తగ్గించనున్నారు. దీంతో చంద్రయాన్-3 నౌక చంద్రడిపై ఉన్న 100 కిలోమీటర్ల కక్ష్యలోకి చేరుకోనున్నది. ఆ తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండింగ్ మాడ్యూల్ విడపోయి ఒంటిరిగా చంద్రుడిపై దిగనున్నది. అంతా అనుకున్నట్లు జరిగితే చంద్రుడిపై ఈ నెల 23న ల్యాండ్ అవుతుంది. ఆ తర్వాత దానిలోని రోవర్ బయటకు రానున్నది.

చంద్రయాన్-2-3ని జూలై 14న పంపగా.. సరిగ్గా నెల తిరిగే సరికి చంద్రునికి కక్ష్యలోకి చేరింది. ఇస్రో శాస్త్రవేత్తలు క్రమక్రమంగా ఈ వ్యోమనౌకను చంద్రునికి దగ్గరగా చేరుస్తున్నారు. మరో వారం తర్వాత ఇందులోని కీలకమైన భాగం చంద్రునికి మరింత చేరువగా వెళ్లనున్నది.


First Published:  14 Aug 2023 11:54 AM GMT
Next Story