Telugu Global
National

MPLADS ని నెమ్మదిగా నిర్వీర్యం చేస్తున్న కేంద్రం?

MPLADS కోసం 2022-23 సంవత్సరానికి ప్రభుత్వం కేటాయించింది రూ.3,857.5 కోట్ల నిధులు కాగా విడుదల చేసింది మాత్రం రూ.767.5 కోట్లు మాత్రమే. ఇందులో తెలంగాణకు దక్కింది 15 కోట్ల రూపాయలు మాత్రమే.

MPLADS ని నెమ్మదిగా నిర్వీర్యం చేస్తున్న కేంద్రం?
X

పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకాన్ని (MPLADS) కేంద్రం నెమ్మదిగా నిర్వీర్యం చేస్తోందా? పథకానికి నిధులు విడుదల చేస్తున్న తీరు చూస్తూ ఉంటే అదే నిజమనిపిస్తోంది.

MPLADS కోసం 2022-23 సంవత్సరానికి ప్రభుత్వం కేటాయించింది రూ.3,857.5 కోట్ల నిధులు కాగా విడుదల చేసింది మాత్రం రూ.767.5 కోట్లు మాత్రమే. ఇందులో తెలంగాణకు దక్కింది 15 కోట్ల రూపాయలు మాత్రమే.

MPLADS కింద కేంద్రం విడుదల చేసిన నిధులలో ఎక్కువ భాగం బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ (రూ. 127.5 కోట్లు), కర్ణాటక (రూ. 37.5 కోట్లు)కు ఇచ్చారు. మొన్నటి దాకా అధికార కూటమిలో బీజేపీ భాగమైన బీహార్ కు కూడా 70 కోట్ల రూపాయలు వచ్చాయి.

నామినేటెడ్ సభ్యులతో సహా ఉభయ సభల ఎంపీలు, MPLADS నిధులతో తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టగల్గుతారు. దీని కోసం ప్రతి ఏడాది రూ.5 కోట్లు కేటాయిస్తున్నారు. 1993 డిసెంబర్ 23న లోక్‌సభలో ఈ పథకాన్ని తొలిసారిగా అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రకటించారు.

కోవిడ్-19 మహమ్మారి వల్ల‌, కేంద్ర ప్రభుత్వం 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు MPLAD పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే, ఈ పథకం నవంబర్ 2021లో పునరుద్ధరించారు. 2025-26 వరకు ఈ పథకం కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ వ్యవహారం చూస్తూ ఉంటే ప్రకటించకుండానే ఆ పథకాన్ని నీరుగార్చి ఆపేయాలని చూస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

First Published:  8 March 2023 2:54 AM GMT
Next Story