Telugu Global
National

మ‌ళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు

పెరిగిన ఈ ధ‌ర‌లు బుధ‌వారం నుంచే అమ‌లులోకి రానున్నాయి. మంగ‌ళ‌వారం వ‌ర‌కు గృహ వినియోగ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ హైద‌రాబాద్‌లో రూ.1105 ఉండ‌గా, తాజా పెంపుతో అది రూ.1155 అయింది.

మ‌ళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు
X

కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోసారి సామాన్యుల‌పై భారం మోపింది. గృహ వినియోగ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ.50 పెంచుతూ నిర్ణ‌యించింది. వాణిజ్య సిలిండ‌ర్ ధ‌ర‌ను రూ.350.50 పెంచింది. ఇప్ప‌టికే వంట గ్యాస్ ధ‌ర‌లు భ‌రించ‌లేని స్థాయిలో ఉండ‌గా, మ‌రోసారి ధ‌ర‌లు పెంచ‌డంతో సామాన్యుడిపై గుదిబండ మోపిన‌ట్ట‌యింది.

గ్యాస్ ధ‌ర‌లను పెంచుతూ పెట్రోలియం సంస్థ‌లు నిర్ణ‌యం తీసుకోవ‌డంతో పెరిగిన ఈ ధ‌ర‌లు బుధ‌వారం నుంచే అమ‌లులోకి రానున్నాయి. మంగ‌ళ‌వారం వ‌ర‌కు గృహ వినియోగ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ హైద‌రాబాద్‌లో రూ.1105 ఉండ‌గా, తాజా పెంపుతో అది రూ.1155 అయింది. వాణిజ్య సిలిండ‌ర్ ధ‌ర ఢిల్లీలో 2119.50 కి ఎగ‌బాకింది.

ఇప్ప‌టికే నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌ల పెరుగుద‌ల‌తో అల్లాడిపోతున్న సామాన్య ప్ర‌జ‌లకు ప్ర‌స్తుతం గ్యాస్ ధ‌ర‌ల పెరుగుద‌ల మ‌రింత భారంగా ప‌రిణ‌మించ‌నుంది.

First Published:  1 March 2023 5:07 AM GMT
Next Story