Telugu Global
National

ఆరేళ్లు నిండితేనే ఫస్ట్‌ క్లాస్ ఎంట్రీ.. కేంద్రం తాజా గైడ్ లైన్స్‌

వచ్చే విద్యా సంవత్సరం 2024-25 నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఆరేళ్లు నిండితేనే ఫస్ట్‌ క్లాస్ ఎంట్రీ.. కేంద్రం తాజా గైడ్ లైన్స్‌
X

స్కూల్స్‌లో చిన్నారుల అడ్మిషన్లపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆరేళ్లు నిండిన చిన్నారులకే ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యా శాఖ పేర్కొంది. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు లేఖలు రాసింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఈ సూచనలు చేసింది కేంద్రం.

ఆరేళ్లు నిండితేనే చిన్నారులకు గ్రేడ్‌-1 లేదా ఒకటో తరగతిలో అడ్మిషన్‌ ఇవ్వాలని సూచించింది కేంద్రం. వచ్చే విద్యా సంవత్సరం 2024-25 నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ-2020, రైట్‌ టు ఎడ్యుకేషన్‌ యాక్ట్- 2009 కింద ఒకటో తరగతిలో చేరే పిల్లలకు ఆరేళ్ల వయసు తప్పనిసరి చేస్తూ కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

ఫౌండేషన్ లెవల్‌లో స్టూడెంట్స్‌కు ఐదేళ్ల పాటు అభ్యాస అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా 3 ఏళ్లు ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌, 2 ఏళ్లు ప్రాథమిక విద్యలో తొలిదశ అయిన తర్వాత 1, 2వ తరగతులు ఉంటాయి. ప్రీ స్కూల్‌ నుంచి 2వ తరగతి వరకు పిల్లలకు ఎలాంటి అవాంతరాలు లేని అభ్యాస పద్ధతిని ప్రోత్సహించాలన్నది ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం.

First Published:  27 Feb 2024 12:00 PM GMT
Next Story