Telugu Global
National

మహాత్ముడికి ప్రముఖుల నివాళి

మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్‌ వద్ద జాతిపితకు రాష్ట్రపతి, ప్రధాని, విపక్ష నేత నివాళులు

మహాత్ముడికి ప్రముఖుల నివాళి
X

జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని గాంధీ స్మారకం రాజ్‌ఘాట్‌ వద్దకు వెళ్లి మహాత్ముడికి అంజలి ఘటించారు. అంతకుముందు సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదిగా ప్రధాని గాంధీకి నివాళులు అర్పించారు. 'సత్యం, సామరస్యం, సమానత్వం అనే సిద్ధాంతాలతోనే బాపూజీ జీవితం గడిచింది. ఆయన ఆదర్శాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిస్తాయి' అయని ప్రధాని గుర్తుచేసుకున్నారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు రాజ్‌ఘాట్‌ వద్ద జాతిపితకు నివాళులు అర్పించారు. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా, ఢిల్లీ సీఎం ఆతిశీ తదితరులు మహాత్ముడి సేవలను స్మరించుకున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు గాంధీజికి నివాళులు అర్పించారు. అహింసామార్గంలో ఉద్యమించి బానిస సంకెళ్లు తెంచి బ్రిటిష్‌ పాలకుల నుంచి దేశానికి విముక్తి కలిగించిన మహాత్ముడి బోధనలు నేటికీ అనుసరణీయం అన్నారు.

విజయ్‌ ఘాట్‌లో లాల్‌ బహదూర్‌ శాస్త్రికి నివాళులు

స్వతంత్ర భారత రెండో ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాని నివాళులు అర్పించారు. శాస్త్రి ఇచ్చిన జై జవాన్‌, జై కిసాన్‌ నినాదం భావి తరాలకూ ప్రేరణగా నిలుస్తుందన్నారు. దేశ స్వాభిమానం కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ప్రధానితో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, విపక్ష నేత రాహుల్‌ గాంధీ ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా, ఢిల్లీ సీఎం ఆతిశీ తదితరులు ప్రముఖులు విజయ్‌ ఘాట్‌లో ఆయనకు నివాళులు అర్పించారు

First Published:  2 Oct 2024 3:35 AM GMT
Next Story