Telugu Global
National

బిహార్ డిప్యూటీ సిఎం తేజ‌స్వి యాద‌వ్ అరెస్టుకు సిబిఐ రంగం సిద్ధం..!?

బీహార్ లో నితీష్ కుమార్ తమ పార్టీతో తెగతెంపులు చేసుకొని ఆర్జేడీతో జతకట్టడంతో మండిపోతున్న బీజేపీ, ఆర్జేడీ నేత‌ తేజస్వీ యాదవ్ అరెస్టుకు రంగం సిద్దం చేసినట్టు తెలుస్తోంది. 14 యేళ్ళ నాటి రైల్వే ఉద్యోగాల కుంభకోణంలో ఉప‌ముఖ్య‌మంత్రి తేజ‌స్వి యాద‌వ్ ను సీబీఐ అరెస్టు చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని సమాచారం.

బిహార్ డిప్యూటీ సిఎం తేజ‌స్వి యాద‌వ్ అరెస్టుకు సిబిఐ రంగం సిద్ధం..!?
X

బిజెపితో బంధాల‌ను తెంచుకుని పాత మిత్రులు ఆర్‌జెడీ, కాంగ్రెస్ త‌దిత‌రుల‌తో క‌లిసి జెడియు నేత నితీష్ కుమార్ బిహార్ లో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. అప్ప‌టినుంచే రాష్ట్రంలో తీవ్రమైన చ‌ర్య‌ల‌కు కేంద్రం లోని బిజెపి ప్ర‌భుత్వం పాల్ప‌డుతుంద‌నే అనుమానాలు ఏర్ప‌డ్డాయి. అనుకున్న‌ట్టుగానే సిబిఐ రంగంలోకి దిగింది. 14 యేళ్ళ నాటి రైల్వే ఉద్యోగాల కుంభకోణంలో ఉప‌ముఖ్య‌మంత్రి తేజ‌స్వి యాద‌వ్ ను సీబీఐ అరెస్టు చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని సమాచారం.. కేంద్ర దర్యాప్తు సంస్థ ఏ క్ష‌ణంలోనైనా అతన్ని అరెస్టు చేసే అవకాశం ఉందని వార్త‌లు వ‌స్తున్నాయి.

యుపిఎ-1 ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న కాలంలో జరిగిన భూముల కుంభకోణం అతిపెద్ద మోసాలలో ఒకటిగా సిబిఐ ప‌రిగ‌ణిస్తున్న‌ట్టు తెలుస్తోంది. తేజ‌స్వికి వ్య‌తిరేకంగా బ‌ల‌మైన సాక్ష్యాలు ఉన్న హార్డ్ డిస్క్ ను సిబిఐ దాడుల సంద‌ర్భంగా స్వాధీనం చేసుకున్న‌ట్టు చెబుతున్నారు. ఉద్యోగాల కోసం వారికి త‌మ భూములు ఇచ్చామ‌న్న 1458 మంది పేర్లు గ‌ల జాబితా ఈ డిస్క్ లో ఉంద‌ని స‌మాచారం.

స్నేహితులు,కుటుంబ సభ్యుల పేరుతో వారి భూమిని స్వాధీనం చేసుకున్నార‌ని ఆ వర్గాలు తెలిపాయి. ఈ 1,458 మంది లో 16 మందిని విచారించిన సిబిఐ వారి ఆరోప‌ణ‌లు స‌రైన‌వేన‌ని ధృవీక‌రించింద‌ని తెలిసింది. దీనిపై సిబిఐ త్వ‌ర‌లో రైల్వే శాఖ కు లేఖ రాయ‌నున్న‌ది. బుధ‌వారంనాడు సిబిఐ 27 చోట్ల దాడులు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే.

చూస్తూ ఉండండి..ఇంకా ఏమేం జ‌రుగుతాయో చూడండి..: సిఎం నితీష్‌

సిబిఐ దాడులు, ఉప‌ముఖ్య‌మంత్రి తేజ‌స్వి యాద‌వ్ అరెస్టు కానున్నార‌న్న వార్త‌ల‌పై ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ తీవ్రంగా స్పందించారు. " చూస్తూ ఉండండి.. ఏం జ‌రుగుతున్న‌దో" అంటూ ప్ర‌జ‌ల‌ను కోరారు. బుదధ‌వారంనాడు అసెంబ్లీలో త‌నపై విశ్వాస ప‌రీక్ష‌కు కొద్ది గంట‌ల ముందు మాట్లాడుతూ.. ఎటువంటి ప‌రిణామాలు జ‌రుగుతాయో చూస్తూ ఉండండి అని వ్యాఖ్యానించారు.

First Published:  25 Aug 2022 3:45 PM GMT
Next Story